'హరి హర వీరమల్లు' చూసిన పవన్ కళ్యాణ్.. కొత్తగా ఏంటిది..?
on Jul 21, 2025

'బ్రో' తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. పవన్ నటించిన మొదటి పీరియాడిక్ ఫిల్మ్ కావడంతో పాటు.. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న తొలి సినిమా కావడంతో.. 'హరి హర వీరమల్లు'పై భారీ అంచనాలు ఉన్నాయి. జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాని.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చూడటం విశేషం. (Hari Hara Veera Mallu)
అందరి హీరోల్లాగా పవన్ కళ్యాణ్ పెద్దగా సినిమాలు చూడరు. తాను నటించిన సినిమాలు కూడా ఆయన చూడటం అరుదు. అలాంటిది 'హరి హర వీరమల్లు'ని ఇప్పటికే ఆయన రెండు మూడు సార్లు చూసినట్లు తెలుస్తోంది. తాజాగా త్రివిక్రమ్ తో కలిసి మరోసారి చూసినట్లు సమాచారం. 'వీరమల్లు' అవుట్ పుట్ చూసి పవన్ ఎంతో ఇంప్రెస్ అయ్యారట. మూవీ రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న ఆయన.. ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను తీసుకొని, నిర్మాతకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారట. అందుకే డిప్యూటీ సీఎంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. వీరమల్లు మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఎప్పుడూ లేని విధంగా.. ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. మొత్తానికి 'హరి హర వీరమల్లు' పట్ల పవన్ కాన్ఫిడెన్స్, ఇంట్రెస్ట్ ని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించడమే, పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



