అనసూయ ఈ మధ్య స్పీడ్ బాగా పెంచింది. యాంకర్స్ అందరిలోకి అనసూయ కొంచెం డిఫరెంట్. అందానికి అందం, మంచి నవ్వు, ఎవరేమన్నా అంటే కౌంటర్ ఇచ్చి పడేసే ఆటిట్యూడ్ , ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేసే తత్త్వం వెరసి హోమ్లీ అనసూయ. బుల్లితెర మీద చిన్నా చితక యాంకరింగులు చేసుకునే అనసూయకు టర్నింగ్ పాయింట్ జబర్దస్త్ వల్ల వచ్చింది. ఇక అంతే అప్పటినుంచి ఇప్పటి వరకు వెనుదిరిగి చూసుకోలేదు అనసూయ. ఈమె డ్రెస్సింగ్ స్టైల్ మీద ఎన్నో రూమర్స్, కామెంట్స్ వచ్చినా అరే చోడ్ దో అనుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. తర్వాత మూవీ ఇండస్ట్రీకి కూడా వెళ్లి అక్కడ కూడా తానేంటో నిరూపించుకుంది. అనసూయ ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటుంది.
సోషల్ మీడియాలో ఫాన్స్ తో అన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. దీపం ఉన్నంత వరకే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతకు అనసూయకి సరిపోతుంది. అది, ఇది అనే రెస్ట్రిక్షన్స్ లేకుండా తన రోల్ ఎలివేట్ అయ్యే అన్ని షోస్ లోనూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్ డ్రస్సుల్లో అనసూయ ఇంకా క్యూట్ గా కనిపిస్తూ అలరిస్తోంది. షూటింగ్స్ కోసం కాస్ట్యూమ్స్ తో రెడీ ఐన వెంటనే ఆ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసేస్తుంది. అనసూయకు ఇప్పుడు చేతినిండా షోస్, మూవీస్ చేస్తూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తోంది. వీటితో పాటు ఫామిలీ లైఫ్ ని కూడా ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తోంది. పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్న పొట్టి దుస్తుల్లో అనసూయ లుక్స్ చాలా స్టన్నింగ్ గా ఉన్నాయి.ఇప్పుడు బుల్లి తెర పై గ్లామర్ ఐకాన్ గా అనసూయ పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అనసూయ సూపర్ సింగర్ జూనియర్ షోలో సుధీర్ తో కలిసి హోస్ట్ గా చేస్తోంది. వెరీ బ్యూటిఫుల్, వన్ అండ్ ఓన్లీ స్మిలింగ్ క్వీన్, మిస్ బ్యూటీ అంటూ నెటిజన్స్ ఈమె న్యూ లుక్ కి కామెంట్స్ ఇచ్చేస్తున్నారు.