వసుధారా జరిగిన విషయం గురుంచి ఆలోచిస్తూ వెళుతూ ఉంటుంది. ఇంతలో జగతి వచ్చి మాట్లాడబోతుంది. వసు ఏమో జరిగిన విషయం గురుంచి చెప్పబోయేంతలో రిషి అక్కడికి వస్తాడు. మినిస్టర్ గారి దగ్గరకు ఫైల్ తీసుకుని మీరు, మీ స్టూడెంట్ వెళ్ళండి మేడం అని చెప్తాడు. మీరు వెళ్లడమే కరెక్ట్ రిషి సర్ అని జగతి అంటుంది. రిషి సరే అంటాడు. ఐతే మీ స్టూడెంట్ కి రెడీగా ఉండమని చెప్పండి కారు దగ్గర వెయిట్ చేస్తాను అంటాడు. జగతి వసూకి జాగ్రత్తగా వెళ్ళమని చెప్తుంది. తర్వాత జగతి తన వర్క్ లో పడిపోతుంది. ఇంతలో దేవయాని ఫోన్ చేసి ఎలా ఉన్నావ్ అని వెటకారమాడుతుంది. ఇప్పుడే కదా ఇంటి దగ్గర నుంచి కాలేజీ కి వచ్చాను అప్పుడే ఏమైపోతానని అలా అడుగుతున్నారు అని కౌంటర్ ఇస్తుంది. అక్కడ మహేంద్ర ఉన్నాడా అంటుంది. రెండు నిమిషాలు నీతో మాట్లాడాలి అని స్వరం తగ్గించి కొద్ది రోజులుగా రిషి ఎందుకో డల్ గా ఉంటున్నాడు అంటుంది. నేనూ గమనించాను అక్కయ్య అంటుంది జగతి. గమనిస్తే సరిపోదు తెలుసుకోవాలి కదా అంటుంది. రిషి స్కూల్ పిల్లాడు కాదు కాలేజీ ఎండి అంటుంది జగతి.
రిషి విషయం తెలుసుకోవడానికి నీ శిష్యురాలి సలహా తీసుకోకపోయావా అంటుంది. వెంటనే జగతి దేవయానికి గట్టిగా రిటార్ట్ ఇస్తుంది. ఇంకో వైపు రిషి, వసు కారులో వెళ్తుంటారు. మినిస్టర్ గారి దాగరకు వెళ్లి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురుంచి చెప్తారు. తర్వాత జగతికి మినిస్టర్ కాల్ చేస్తారు. రిషి లాంటి కొడుకుని కన్నందుకు అభినందించాలి అంటూ పొగుడుతారు. ఇక మినిస్టర్ దగ్గర నుంచి రిషి , వసు రిటర్న్ అవుతారు. ఆకలిగా ఉందని చెప్పి పుచ్చకాయ బండి దగ్గర ఆగుతారు. రెండు పుచ్చకాయ ముక్కలు ఇమ్మని అడుగుతుంది వసు. ఏమిటి బేరాలేమీ ఆడట్లేదు అంటాడు సరదాగా ఆటపట్టిస్తూ. డబ్బులు ఇచ్చేది మీరేగా ... బేరాలాడడం ఎందుకని అంటూ చెప్తుంది వసు. ఆ తర్వాత వాళ్లిద్దరూ పుచ్చకాయ తింటూ ఉంటారు. అప్పుడు రిషి మూతికి పుచ్చకాయ ముక్క అంటుకుంటుంది దాన్ని ఫోటో తీసి చూపిస్తుంది రిషికి. మిగతా హైలైట్స్ కోసం ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ చూడాల్సిందే.