ఒక సెన్సార్ బోర్డ్ మెంబర్ అధ్యక్షతలో 9 మంది అడ్వైజరీ పేనల్ మెంబర్స్ కలిసి, అదివరకు సెన్సార్ మెంబర్స్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించిన చిత్రాన్ని మళ్లీచూసి, ఇంతకుముందు సెన్సార్ సభ్యులు ఇచ్చిన నిర్ణయాన్ని ఆమోదించవచ్చు, లేదా కొన్ని మార్పులు చేయవచ్చు. అప్పటికీ రివిజన్ కమిటీ నిర్ణయం నిర్మాతకు నచ్చకపోతే, ఆ కమిటీతో మీటింగ్ ఏర్పాటుచేసుకొని, సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఆ మీటింగ్ వల్ల కూడా తనకు ప్రయోజనం జరగలేదనుకుంటే చివరియత్నంగా ప్రభుత్వానికి నిర్మాత విజ్ఞప్తి చేసుకోవచ్చు. సాధారణంగా రివిజన్ కమిటీ మరీ బిగుసుకుపోకుండా నిర్మాతకు అనుకూలంగానే వ్యవహరిస్తుంటుంది.
ఒక సినిమాకు 'యు' సర్టిఫికెట్ వస్తే ప్రొడ్యూసర్ ఎలాంటి అంగీకారపత్రం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ, 'ఎ' (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికెట్ వస్తే తప్పనిసరిగా యాక్సెప్టెన్స్ లెటర్ సెన్సార్ ఆఫీసుకు ఇవ్వాలి. ఆ తర్వాత కట్ చేయబడిన లెంగ్త్, దాని పొడవు వివరాలు, ఏ సీన్ నుంచి ఏ సీన్ దాకా ఎంత కట్ చేయబడిందనే వివరాలు ఇవ్వాలి. తర్వాత మొత్తం సినిమా లెంగ్త్ తగ్గకుండా తొలగించబడిన స్థలంలో వేరే కొత్త సీన్లు ఎన్ని అతికించారనే వివరాలన్నీ సెన్సార్ ఆఫీస్‌కు ఇవ్వాలి. వాటిని సెన్సార్ సభ్యులు మళ్లీ పరిశీలిస్తారు. ఈ తంతు పూర్తయిన తర్వాత సభ్యుల నిర్ణయం ప్రకారం రీజనల్ ఆఫీసర్ సర్టిఫికెట్ ఇస్తారు. రీజనల్ ఆఫీసర్ లేని పక్షంలో అడిషనల్ రీజనల్ ఆఫీసర్‌కు సర్టిఫికెట్‌పై సంతకం చేసే అధికారం ఉంది.
ఒకవేళ సినిమా సెన్సార్ నిబంధనలకు భిన్నంగా ఉందంటే ఎగ్జామినింగ్ కమిటీ సర్టిఫికెట్‌ను ఆమోదించకుండా ఆ విషయం రీజనల్ ఆఫీసర్‌కు తెలియజేస్తుంది. వెంటనే ఆఫీసర్ ఆ విషయాన్ని చైర్మన్‌కు తెలియజేస్తారు. ఎందుకంటే సర్టిఫికెట్ నిరాకరించిన పక్షంలో, ఆ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకొనే హక్కు రీజనల్ ఆఫీసర్‌కు లేదు. కాబట్టి చైర్మన్ ఒక రివిజన్ కమిటీని ఏర్పాటుచేసి, సినిమాని పరిశీలించాల్సిందిగా కోరతారు. రివిజన్ కమిటీ కొన్ని మార్పులు సూచించి, సర్టిఫికెట్‌ను ఇవ్వవచ్చు. సాధారణంగా రివిజన్ కమిటీ సభ్యుల మెజారిటీ నిర్ణయాన్ని చైర్మన్ ఆమోదిస్తారు.
నకిలీ సర్టిఫికెట్స్‌ను సృష్టించినా, సర్టిఫికెట్ లేకుండా చిత్రాన్ని ప్రదర్శించినా, ఆ ప్రదర్శకులకు జైలుశిక్ష, లేదా జరిమానా, లేదా ఆ రెండూ విధిస్తారు.