Home  »  News  »  లైంగిక వేధింపుల కేసులో యాక్ట‌ర్ విజ‌య్ అరెస్ట్‌

Updated : Jun 28, 2022

 

మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబు లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యారు. విచారణ నిమిత్తం ఎర్నాకుళం సౌత్ పోలీస్ స్టేషన్ ముందు హాజరైన‌ప్పుడు అత‌డిని అరెస్టు చేశారు. జూన్ 22న కేరళ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సినిమా పాత్రల కోసం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ నటి కూడా అయిన ఓ మహిళ ఆరోపించడంతో విజయ్ బాబుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ముందస్తు బెయిల్‌ను మంజూరు చేస్తూ, కేరళ హైకోర్టు ఆయనను రాష్ట్రం విడిచి వెళ్లవద్దని, పాస్‌పోర్ట్‌ను సమర్పించాలని కోరింది.

సోమవారం నుంచి జూలై 3 వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించేందుకు దర్యాప్తు బృందానికి అనుమతి లభించింది. కాగా మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) అతనికి మద్దతునిచ్చింది. కోర్టు తీర్పు తర్వాత మాత్రమే ఏదైనా చర్య తీసుకుంటామని పేర్కొంది.

ఏప్రిల్ నెలాఖరున విజయ్ బాబు దుబాయ్ వెళ్లగా, అదే సమయంలో ఓ మహిళ అతనిపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. కొచ్చి పోలీసులు కేసు నమోదు చేయడంతో అత‌ను దేశం విడిచి పారిపోయాడు. 39 రోజుల పాటు దేశానికి దూరంగా ఉన్న విజయ్ బాబు జూన్ 1న కొచ్చికి తిరిగి వచ్చాడు. ఎర్నాకుళంలోని అత‌ని అపార్ట్‌మెంట్‌లో విజయ్‌బాబు తనను చాలాసార్లు చిత్రహింసలకు గురిచేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమెకు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు కల్పిస్తామని కూడా అత‌ను హామీ ఇచ్చాడు.

“నేను అవును లేదా కాదు అని చెప్పలేని స్థితిలో ఉన్న‌ప్పుడు, అతను తన ఆనందం కోసం నా శరీరాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకున్నాడు. అతను నన్ను బలవంతం చేశాడు. నా ఇష్టానికి విరుద్ధంగా కారులో నన్ను ఓరల్ సెక్స్‌కి కూడా బలవంతం చేశాడు. నేనప్పుడు షాక్‌లో ఉన్నాను, మాట్లాడలేని, స్పందించలేని స్థితిలో ఉన్నాను.” అని బాధితురాలు ఆ ఘ‌ట‌న‌ను వెల్ల‌డించిన ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్ల‌డించింది. 

అయితే తనపై ఆమె చేసిన‌ ఆరోపణలను ఏప్రిల్ 26న విజ‌య్ బాబు ఖండించాడు. తనను చిత్రహింసలకు గురిచేస్తున్నది ఆ యువతి అని, తానే 'అసలు బాధితుడిని' అని ఫేస్‌బుక్ లైవ్‌లో ఆరోపించాడు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.