కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఘోస్ట్'. ఈ మూవీలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన నాగార్జున లుక్ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగార్జున తనయుడు, యంగ్ హీరో అఖిల్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
'అఖిల్(2015)' సినిమాతో హీరోగా పరిచయం కావడానికి ముందే అక్కినేని మల్టీస్టారర్ 'మనం'(2014) అఖిల్ మెరిశాడు. నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన 'మనం' సినిమాలో చివరిలో అఖిల్ కనిపించి సందడి చేశాడు. ఇప్పుడు నాగార్జున నటిస్తున్న ఘోస్ట్ మూవీలోనూ అఖిల్ సందడి చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో అఖిల్ ఓ కీ రోల్ లో కనిపించనున్నాడని టాక్. దీంతో ప్రవీణ్ సత్తారు.. అఖిల్ ని ఎలాంటిపాత్రలో చూపిస్తున్నాడో అనే ఆసక్తి అక్కినేని అభిమానుల్లో నెలకొంది.
ఇక ఇటీవల 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు అఖిల్. ఈ సినిమా భారీ వసూళ్లతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అలాగే త్వరలో సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న 'ఏజెంట్' సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడు అఖిల్.