Prabhas is doing safe.. క్లారిటీ ఇచ్చిన మారుతి
on Dec 9, 2025

-ప్రభాస్ ఎక్కడ ఉన్నాడు
-అభిమానులు ఎందుకు టెన్షన్ పడ్డారు
-మారుతి ఇచ్చిన రిప్లై ఏంటి!
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో వరుస చిత్రాలు అనౌన్స్ చేస్తు షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే, వన్ అండ్ ఓన్లీ ప్రభాస్(Prabhas)అని చెప్పవచ్చు. అంతలా తన సినీ కెరీర్ ని జెట్ స్పీడ్ వేగంతో ముందుకు తీసుకుపోతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం జపాన్(Japan)దేశంలో పర్యటిస్తున్నాడు. బాహుబలి ఎపిక్ ఈ నెల 12 న జపాన్ లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కోసమే జపాన్ వెళ్ళాడు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పిక్స్ కూడా హల్ చల్ చేస్తున్నాయి. వాటిని చూసిన అభిమానుల్లో ఇప్పుడు టెన్షన్ మొదలయ్యింది.
ఆనంద పడాల్సిన అభిమానులు టెన్షన్ పడటానికి కారణం ఉంది. రీసెంట్ గా జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీంతో ఎంతో మంది నిరాశ్రయులుగా మిగులుతున్నారు.ఈ నేపథ్యంలోనే తమ హీరో ప్రభాస్ క్షేమంగా ఉన్నాడా లేదా అనే ఆందోళనని వ్యక్తం చేస్తూ అభిమానులు ట్వీట్స్ చేస్తు వస్తున్నారు. ఇప్పుడు ఆ ట్వీట్స్ కి రాజాసాబ్ దర్శకుడు 'మారుతి'(Maruthi) స్పందించాడు. ఫ్యాన్స్ ట్వీట్స్ కి బదులిస్తూ ప్రభాస్ క్షేమంగానే ఉన్నాడు. పైగా భూకంపం సంభవించిన ప్రాంతంలో లేడు. కొద్దిసేపటి క్రితమే ప్రభాస్ తో మాట్లాడాను అని ట్వీట్స్ చెయ్యడంతో ఫ్యాన్స్ లో టెన్షన్ తగ్గినట్లయ్యింది.
also read: అఖండ 2 కి చెన్నై హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఇక రాజాసాబ్ తో పాన్ ఇండియా సెల్యులాయిడ్ పై ప్రభాస్, మారుతీ ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫస్ట్ టైం హర్రర్ జోనర్ లో చేస్తుండటంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపిస్తుండటం కూడా అభిమానులకి, ప్రేక్షకులకి అదనపు బోనస్. దీంతో వచ్చే ఏడాది జనవరి 9 కోసం అందరు వెయిటింగ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



