బుడ్డోడి సినిమాని తొక్కేసే ప్రయత్నాలు షురూ!
on Dec 15, 2015
.jpg)
పాపం.. ఎన్టీఆర్‌కి అన్నీ బ్యాడ్ డేసే. హిట్టు సినిమా పడి చాలా కాలం అయ్యింది. టెంపర్ హిట్టు సినిమానే అనిపించినా, అనుకొన్నంత వసూళ్లు రాలేదు. ఇప్పుడు అందరి కళ్లూ నాన్నకు ప్రేమతో సినిమాపై పడ్డాయి. ఈసారైనా హిట్టు కొట్టేస్తాడని అభిమానుల నమ్మకం. బిజినెస్ ఓ రేంజులో జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. అయితే ఇవన్నీ పట్టాలు తప్పేలా కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ సినిమాకి తొక్కేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్.
`ఎన్టీఆర్ సినిమాని కొనొద్దు` అంటూ కొంతమంది పంపిణీదారుల్ని `ముందస్తు`గా ఓ వర్గం హెచ్చరిస్తోందని తెలుస్తోంది. `సినిమా ఏం లేదు.. కొని నష్టపోకండి` అంటూ గాసిప్పులు వదులుతున్నార్ట. ఈ భయంతోనే ఎన్టీఆర్ సినిమా కోసం అడ్వాన్సులు ఇచ్చిన కొంతమంది మళ్లీ తిరిగి తీసేసుకొన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.సంక్రాంతి బరి నుంచి తప్పుకొంటే.. నీ సినిమా కొంటాం.. అని కూడా కొంతమంది బయ్యర్లు అడుగుతున్నార్ట.
విడుదలకు ముందే... రూ.60 కోట్ల బిజినెస్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. అయితే.. అదంత ఈజీ కాదన్న విషయం వాళ్లకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమాకి గండికొట్టాలన్న ప్రయత్నాలు టాలీవుడ్‌లో ముమ్మరంగా సాగుతుండడం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఆందోళనకు గురి చేస్తోంది. మరి ఈ వ్యూహాలను ఎన్టీఆర్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



