ఎన్టీఆర్ సినిమాలో తమన్నా?
on Dec 8, 2015
.jpg)
నాగార్జున - కార్తీ మల్టీ స్టారర్ చేస్తున్న తమన్నా త్వరలో మరో ఐటం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. నా ఇంటి పేరు సిల్కూ.. అంటూ ఇంతకుముందు 'అల్లుడు శీను' సినిమా కోసం ఐటం సాంగ్ చేసిన మిల్కీ తమన్నా..సుకుమార్ - ఎన్టీఆర్ మూవీ కోసం స్పెషల్ సాంగ్ చేస్తుందని వినిపిస్తోంది. 100 % లవ్ మూవీతో తనను కొత్తగా ప్రజెంట్ చేసిన సుకుమార్ కోసం ఈ సాంగ్ చేయడానికి తమన్నా అంగీకరించిందని అంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించే " నాన్నకు ప్రేమతో " మూవీ సుకుమార్ కెరీర్ కు కీలకం కానుంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో తమన్నా సాంగ్ కోసం అదరగొట్టే ట్యూన్ రెడీ అయిందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ నెల 20 తర్వాత చిత్ర యూనిట్ హైదరాబాద్ వస్తు౦ది. 23న ఆడియో అంటున్నారు. ఆ తర్వాతే ఈ ఐటెం సాంగ్ చిత్రీకరణ ఉండొచ్చని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



