కమల్ ముందు మనోళ్లు దిగదుడుపే!
on Jun 1, 2015

లోకనటుడు కమల్ దగ్గర మన తెలుగు హీరోలు దిగదుడుపే అన్న సంగతి అందరకీ తెలిసిందే. అయితే నటనలోనే కాదు ఆలోచన పరంగానూ మనోళ్లు తేలిపోయారు. ఎందుకంటే కోట్లకు కోట్లు సంపాదించి కోటలు కట్టి, వారసులకి కట్టబెట్టి.....వాళ్లని కూడా ఇండస్ట్రీలోకి తోసేసే మహానుభావులంతా కమలహాసన్ ని చూసి నేర్చుకోవలసింది చాలా ఉందంటున్నారు. ఎందుకంటే కమల్ హాసన్ తన పిల్లలకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని తేల్చిచెప్పాడు. అదేమని అడిగితే పిల్లలకు మనం ఇవ్వాల్సింది ఆస్తులు కాదు ఆస్తులు సంపాదించుకునే నైపుణ్యత అని ఒక్కముక్కలో తేల్చిచెప్పాడు. అందుకే వాళ్ల భవిష్యత్ వారికే వదిలేశానన్నాడు. అసలు తన పిల్లల్ని సైంటిస్టుగా చూడాలనుకున్నానని.....వాళ్లుమాత్రం నటనవైపే అడుగుశారని అన్నాడు. తన అభిప్రాయాలు వాళ్లపై రుద్దడం ఇష్టంలేకే సైలెంటయ్యా అంటున్నాడు. ఏదిఏమైనా ప్రజల్ని దోచి సంపాదించుకుంటున్న నేతలు, ప్రేక్షకుల్ని దోచుకుంటున్న సినీపెద్దలు....కమల్ ని చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



