రాశీకి క్లాస్ పీకిన అనుష్క
on Dec 12, 2015
.jpg)
ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది రాశీఖన్నా.. ఆల్రెడీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది అనుష్క. వీరిద్దరూ ఈమధ్య మాటా మాటా అనుకొన్నారని టాక్. రాశీకి అనుష్క ఓ క్లాస్ లాంటిది పీకిందని.. గుసగుసలు వినిపిస్తున్నాయి. అదీ.. రాశీ `సైజ్` గురించే. నవతరం కథానాయికల్లో బొద్దు బొద్దుగా ఉండే నాయిక.. రాశీనే. ఇలా ఉంటే రాను రాను అవకాశాలు రావడం కష్టమవుతుందని ఒక్కసారిగా బరువు తగ్గాలని చూసిందట.
కృత్రిమ పద్ధతుల్లో బరువు తగ్గడంపై దృష్టి సారించిందట. ఈ విషయం చెప్పి అనుష్కని సలహా అడిగిందట. దానికి అనుష్క భారీ లెవిల్లో క్లాస్ పీకిందట. ''కృత్రిమంతగా బరువు తగ్గడం మంచిది కాదు. నీ కెరీర్ సంగతి అటుంచు.. నీ ఆరోగ్యం మటాష్ అయిపోతుంది'' అని వార్నింగ్ ఇచ్చిందట. మెల్లిమెల్లిగా తగ్గు.. ఒక్కసారిగా బరువు తగ్గడం కూడా అనారోగ్యమే అని సూక్తి ముక్తావళి వినిపించిందట. ఇదేంటి అనుష్క ఇలా రివర్స్ అయిపోయిందని ముందు కంగారు పడినా, అంతా తన మంచికే చెబుతోంది కదా అని ఆ తరవాత లైట్ తీసుకొందట. అనుష్క వార్నింగ్‌తో బరువు తగ్గాలన్న ఆలోచన విరమించుకొందట రాశీఖన్నా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



