కుమార్తె చేతుల్లో కన్నుమూసిన బప్పీలహిరి
on Feb 16, 2022

సంగీత దర్శకుడు-గాయకుడు బప్పీలహిరి ఫిబ్రవరి 15 అర్ధరాత్రి ముంబైలో కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. గత ఏడాది ఏప్రిల్‌లో కొవిడ్-19 పాజిటివ్‌గా తేలాక ఆయ ఆరోగ్య స్థితి క్షీణిస్తూ వచ్చింది. తాజాగా ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు వెల్లడించిన దాని ప్రకారం, బప్పీలహిరి చివరిసారిగా తన కుమార్తె రీమా లహిరితో మాట్లాడారు, ఆమె చేతుల్లోనే ఆయన తుదిశ్వాస విడిచారు.
1980, 90ల కాలంలో యువతను ఉర్రూతలూగించిన డిస్కో మ్యూజిక్కు ఆద్యుడు బప్పీలహిరి. ఆయన మృతితో దేశమంతా విషాదంలో మునిగిపోయింది. బప్పీ అంత్యక్రియలను నిర్వహించడానికి ఆయన కుమారుడు బప్పాలహిరి యు.ఎస్. నుంచి వస్తున్నట్లు ఫ్యామిలీ ఫ్రెండ్ తెలిపారు. "గత ఏడాది కొవిడ్ సోకిన తర్వాత ఆయన పరిస్థితి దిగజారుతూ వచ్చింది. దానిని నుంచి ఆయన కోలుకోలేకపోయారు. ఆయన కొడుకు బప్పా ఈ రోజు అర్ధరాత్రి 2 గంటలకు ఇండియా చేరుకుంటాడు" అని ఆయన వెల్లడించారు.
పలు ఆరోగ్య సమస్యలకు బప్పీ ట్రీట్మెంట్ తీసుకుటూ వచ్చారు. మంగళవారం రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. ఆయనను బతికించడానికి డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించారు కానీ, కాపాడలేకపోయారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



