'సూరారై పొట్రు' హిందీ రీమేక్‌లో సూర్య గెస్ట్ రోల్!
on Jun 14, 2022
సూర్య ప్రధాన పాత్రధారిగా సుధ కొంగర రూపొందించిన 'సూరారై పొట్రు' మూవీ నేరుగా ఓటీటీలో విడుదలై చక్కని జనాదరణ పొందింది. ఇదే మూవీ తెలుగు వెర్షన్ 'ఆకాశం నీ హద్దురా' పేరుతో వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ హీందీ రీమేక్‌లో సూర్య ఓ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు ఎ.ఆర్. గోపీనాథ్ జీవితం ఆధారంగా 'సూరారై పొట్రు' రూపొందింది. సూర్య పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తోన్న హిందీ రీమేక్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
ఒరిజినల్‌కు దర్శకత్వం వహించిన సుధ కొంగర ఈ రీమేక్‌నూ తీస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తిచేసి, ఇప్పుడు చెన్నైలో రెండో షెడ్యూల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ షూటింగ్ మధ్యలో అక్షయ్‌ను కలిశాడు సూర్య. ఈ సందర్భంగా ఈ రీమేక్‌లో సూర్య ఓ స్పెషల్ రోల్లో కనిపించనున్న సమాచారం వెల్లడైంది. రీసెంట్గా కమల్ హాసన్ విక్రమ్‌లో రోలెక్స్‌గా పవర్ఫుల్ గెస్ట్ రోల్లో కనిపించిన సూర్య, ఇప్పుడు మరో స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వనున్నాడు.
ప్రస్తుతం బాలా దర్శకత్వంలో నటిస్తున్నాడు సూర్య. త్వరలో ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ నిమిత్తం గోవాకు వెళ్లనున్నాడు. ఈ సినిమాతో పాటు వెట్రిమారన్ దర్శకత్వంలో 'వాడివాసల్' మూవీని కూడా ఆయన చేస్తున్నాడు. ఇందులో జల్లికట్టు ఆటగాడిగా ఆయన కనిపించనున్నాడు.