అక్షయ్‌కుమార్‌ని కన్విన్స్ చేస్తున్న సునీల్!
on Nov 17, 2022
సునీల్ ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌ని కన్విన్స్ చేసే పనిలో యమా బిజీగా ఉన్నారు. అదేంటి సునీల్ ఏమైనా ప్యాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నారా? అని అనుకుంటున్నారా? అదేం లేదండీ... ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది తెలుగు సునీల్ గురించి కాదు. బాలీవుడ్ సునీల్ గురించి. అదేనండీ.. సునీల్ శెట్టి గురించి. అక్షయ్‌కుమార్, పరేష్‌రావల్, సునీల్ శెట్టి కలిసి అప్పట్లో హెరాఫెరీ చేశారు. ఈ సినిమాకు ఇప్పుడు థర్డ్ పార్ట్ తెరకెక్కించడానికి మేకర్స్ ముందుకొచ్చారు. ల్యాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న హెరాఫెరీ థర్డ్ పార్ట్ ని చూడటానికి ఆడియన్స్ కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఫస్ట్, సెకండ్ పార్టుల్లో నటించిన అక్షయ్‌కుమార్, పరేష్ రావల్, సునీల్ శెట్టి కూడా ఈ మూడో పార్టులో నటిస్తారని మేకర్స్ చెప్పారు. కానీ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ తాను ఈ సినిమా చేయట్లేదనే విషయాన్ని అనౌన్స్ చేశారు. తనకు చెప్పిన కథ నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి వెనకడుగు వేస్తున్నట్టు ప్రకటించారు అక్షయ్. కానీ ఈ విషయం తనకు అసలు తెలియనే తెలియదని అంటున్నారు సునీల్. ఇటీవల నార్త్ మీడియాతో మాట్లాడిన సునీల్... అక్షయ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న విషయం అసలు తెలియదని చెప్పారు. అయితే అక్షయ్ లేకపోతే ఆ ఫ్రాంఛైజీకి పరిపూర్ణత్వం రాదని అన్నారు. మేకర్స్ తో ఒకసారి మాట్లాడి అక్షయ్‌ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తానని చెప్పారు. అంతా ట్రాక్‌లో ఉందనుకున్న సమయంలో అక్షయ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం తనకు షాకింగ్‌గా ఉందని చెప్పారు. ధార్వి బ్యాంక్ ప్రమోషన్లు పూర్తి కాగానే హెరాఫెరీ నిర్మాత నదియడ్వాలాతో మాట్లాడి అసలు ఏమైందో తెలుసుకుంటానని అన్నారు. అక్షయ్, పరేష్, తాను ఒప్పుకున్నాకే సీక్వెల్ గురించి అనౌన్స్మెంట్ వచ్చిందని, ఇప్పుడు ఈ ట్విస్ట్ ఏంటో తనకు అర్థం కాలేదని అన్నారు సునీల్.