షెర్లిన్ కంప్లైంట్.. రాఖీపై ఎఫ్ఐఆర్!
on Nov 10, 2022
రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఘాటుగా బురద జల్లుకుంటున్నారు. రాఖీ, షెర్లిన్ చర్చలలో ఒకరినొకరు విడిచిపెట్టలేదు. ముందుగా షెర్లిన్ పేరును రాఖీ లాగితే, ఆపై ఆమెపై షెర్లీన్ మాటల దాడి చేసింది. దాంతో రాఖీ మరింత రెచ్చిపోయింది. ఇద్దరు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడమే కాకుండా కేసు నమోదు చేసేందుకు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లారు. అయితే షెర్లీన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా రాఖీపైనే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు పోలీసులు. రాఖీపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదైందంటే...
ఇటీవలి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాఖీ సావంత్ అభ్యంతరకరమైన పదజాలం, కంటెంట్‌ను ఉపయోగించినందుకు న్యాయపరమైన చిక్కుల్లో పడింది. షెర్లిన్ చోప్రా దాఖలు చేసిన ఈ ఎఫ్ఐఆర్లో రాఖీ లాయర్ పేరు కూడా ఉంది. ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రకారం.. షెర్లిన్, రాఖీ ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తదుపరి విచారణ గురించి ఆరా తీయడానికి షెర్లిన్ ఈ రోజు అంటే నవంబర్ 10న పోలీస్ స్టేషన్‌ని సందర్శించనున్నది.
ఏఎన్ఐ ట్వీట్ చేస్తూ, "ఒక నటి ఫిర్యాదుపై, ఐపిసి, ఐటి చట్టంలోని అనేక సెక్షన్ల కింద రాఖీ సావంత్, ఆమె న్యాయవాది ఫల్గుణి బ్రహ్మభట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. విలేకరుల సమావేశంలో వారిద్దరూ తన పేరుకు భంగం కలిగించేలా ఒక అభ్యంతరకరమైన వీడియోను చూపించారని, అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించారని షెర్లిన్ ఆరోపించింది. షెర్లిన్ చోప్రా నటించిందంటూ పోర్న్ వీడియోలను లాయర్‌తో కలిసి రాఖీ చూపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది." అని రాసింది.
రాఖీ సావంత్ సైతం షెర్లిన్ చోప్రాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. షెర్లిన్ పోస్ట్ చేసిన ఒక వీడియోలో, తనకు చాలా మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారని షెర్లిన్ ఆరోపించిందని రాఖీ తన ఫిర్యాదులో పేర్కొంది. షెర్లిన్ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని, అసభ్యకరమైన పదజాలం వాడిందని రాఖీ పోలీసులకు తెలిపింది. గతంలో షెర్లిన్ చోప్రాపై రాఖీ పరువునష్టం కేసు వేసింది. ఇలా వీరిద్దరి మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
