బిపాషాకు కూతురు పుట్టింది
on Nov 12, 2022
ఆగస్ట్ 16న తను ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేసింది బిపాషా బసు. తన ఇన్స్టాగ్రాం హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన పిక్చర్స్‌లో వైట్ షర్ట్ డ్రస్‌లో బేబీ బంప్‌ను చూపిస్తూ స్టన్నింగ్ లుక్‌లో ఆమె కనిపించడంతో ఆ పోస్ట్ వైరల్ అయ్యింది. ఇప్పుడు తనకు పండంటి పాప పుట్టింది. ఈరోజు (నవంబర్ 12)న బిపాషా, కరణ్ సింగ్ గ్రోవర్ ఒక అందాల పాపకు అమ్మానాన్నలయ్యారు.
ఇదివరకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తను, కరణ్.. ఇద్దరూ పాప పుట్టాలని ఎప్పుడూ కొరుకుంటున్నామని వెల్లడించింది. అందుకే కడుపులో ఉన్న బిడ్డను పాపగానే సంబోధిస్తుంటామని చెప్పింది.
బిపాషా, కరణ్ 2016లో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అతడిని పెళ్లి చేసుకోవడానికి తన తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేయాల్సి వచ్చింది బిపాషాకు. ఎందుకంటే అదివరకే కరణ్‌కు రెండు పెళ్లిళ్లు అయ్యి, విడాకులు తీసుకున్నాడు.
మొదట 2008లో శ్రద్ధ నిగంను పెళ్లాడి, 10 నెలలకే విడిపోయాడు. తర్వాత 2012లో జెన్నిఫర్ వింగెట్‌ను పెళ్లి చేసుకొని 2014లో విడాకులిచ్చాడు. మరోవైపు మోడల్, నటుడు డినో మోరియాతో 1996 నుంచి 2002 వరకు డేటింగ్ చేసింది బిపాషా. ఆ తర్వాత జాన్ అబ్రహాంతో 2002 నుంచి 2011 దాకా రిలేషన్షిప్లో ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
