English | Telugu
లక్కంటే శ్రీకాంత్ రెడ్డిదే.. దెబ్బలు తిన్నా కానీ..
Updated : May 18, 2022
కొన్ని ఘటనలు కొంత మందికి చిక్కుల్ని తెచ్చిపెడుతుంటాయి. కానీ కొంత మందికి అవే లక్కుల్ని తెచ్చిపెడుతుంటాయి. ఇటీవలే కరాటే కల్యాణి చేతిలో దెబ్బలు తిన్న శ్రీకాంత్ రెడ్డికి లక్కు బాగా కలిసి వచ్చినట్టే కనిపిస్తోంది. తాజా వివాదంతో వార్తల్లో నిలిచిన శ్రీకాంత్ రెడ్డికి బిగ్ బాస్ సీజన్ 6లో అవకాశం లభించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎండింగ్ కి చేరుకున్న నేపథ్యంలో త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించిన కంటెస్టెంట్ ల ఎంపికని ఇటీవలే ప్రారంభించారని, కొంత మందిని ఇప్పటికే ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కోసం యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. ఇదే నిజమైతే శ్రీకాంత్ రెడ్డికి కరాటే కల్యాణి దెబ్బలతో లక్కు కుదిరినట్టే అంటున్నారు. బిగ్‌బాస్ నాన్ స్టాప్ త్వరలోనే ఎండ్ కాబోతోంది. అఖిల్, బిందు మాధవి టైటిల్ కోసం పోటీపడుతున్నారు. ఈ ఇద్దరిలో బిందు మాధవి టైటిల్ రేసులో ముందుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల తమిళ బిగ్ బాస్ లో బిందు మాధవి తెలుగుపై చేసిన కామెంట్స్ ఇప్పడు ఆమెకు పెద్ద ఇబ్బందుల్ని క్రియేట్ చేసేలా వున్నాయి. టాప్ 5కి సంబంధించిన కసరత్తు కూడా మొదలైంది. ఇందులో అఖిల్, బిందుతో పాటు యాంకర్ శివకు కూడా చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కి సంబంధించిన ఎంపికని ఇప్పటికే సైలెంట్ గా స్టార్ట్ చేసిన స్టార్ మా ఈ సారి చాలా వరకు కొత్త ముఖాలని, బిగ్ బాస్ లోకి తీసుకురాబోతోంది. చాలా వరకు యూట్యూబ్ యాంకర్లు కనిపించబోతున్నారు. ఇప్పటికే సుమన్ టీవి యాంకర్స్ రోషన్, మంజూషాల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పేరు చేరడం ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కరాటే కల్యాణితో శ్రీకాంత్ రెడ్డి ఇటీవల గొడవ పడటం, తన చేతిలో తన్నులు తినడంతో శ్రీకాంత్ రెడ్డి వార్తల్లో నిలిచాడు.