English | Telugu

Biggboss 8 Nominations : నామినేషన్లలో యష్మీకే అత్యధికం..  తనకి ఇదే చివరి వారమా!

బిగ్‌బాస్ మొత్తానికి మూడో వారంలోకి అడుగుపెట్టేసింది. అయితే గత రెండు వారాలుగా నామినేషన్ల నుంచి తప్పించుకుంటు వస్తున్న యష్మీకి ఈసారి కంటెస్టెంట్లు గట్టిగానే నామినేషన్ చేశారు. రెండు వారాల నుంచి నామినేట్ చేద్దామనుకున్న వాళ్లంతా ఈ వారం గుద్దిపడేశారు. ఇప్పటికే హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

మొదటి వారంలో గత సీజన్ శోభాశెట్టిని గుర్తుచేసిన యష్మీ.. రెండో వారంలో మిగిలిన కంటెస్టెంట్లతో నరకం స్పెల్లింగ్ రాయించింది. చీఫ్ అయ్యాననే గర్వంతో ఇష్టమొచ్చినట్లు బిహేవ్ చేసింది. ఇక దీనికి యష్మీ టీమ్ కూడా తానా అంటే తందానా అన్నారు. ఇలా యష్మీ బిహేవియర్ చూసి ఆడియన్స్ ఎలిమినేట్ చేసేయండి నాగార్జున గారు అంటూ సోషల్ మీడియాలో గట్టిగానే డిమాండ్ కూడా చేశారు. మరోవైపు యష్మీకి నామినేషన్లలో ఓటేసి పంపేద్దామనుకున్న కంటెస్టెంట్లకి గత రెండు వారాలు బిగ్‌బాస్ దయ వల్ల ఆ అవకాశం దొరకలేదు. కానీ మూడో వారం మాత్రం యష్మీ నామినేషన్ లో ట్రోలర్స్ కి దొరికేసింది.

మణికంఠ, సోనియా, సీత సహా చాలా మంది కంటెస్టెంట్లు సోనియాకే గుద్దిపడేశారు. దీంతో అత్యధిక ఓట్లతో ఈవారం నామినేషన్లలోకి అడుగుపెట్టింది యష్మీ. దీని గురించి తెలియగానే యష్మీ యాంటీ ఫ్యాన్స్, చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. రా అమ్మా మెరుపు తీగ.. ఈసారి నిన్ను ఇంటికి పంపకపోతే చూడు, వెల్కమ్ యష్మీ ఇదే నీకు చివరి నామినేషన్ అంటు నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...