English | Telugu

Biggboss 8 Telugu:  యష్మీ కన్నింగ్ ప్లాన్.. నామినేషన్ లో ఉంది ఎవరెవరంటే!

బిగ్ బాస్ హౌస్ లో సెకెండ్ వీక్ నామినేషన్ పూర్తయింది. ఇందులో మొత్తంగా ఎనిమిది మంది నామినేషన్ లో ఉన్నారు. నిఖిల్, ఆదిత్య ఓం, పృథ్వీ , విష్ణుప్రియ, కిర్రాక్ సీత , నాగ మణికంఠ, శేఖర్ బాషా, నైనిక, విష్ణుప్రియ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు.

కిర్రాక్ సీత, ప్రేరణ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ సెకెండ్ రోజు కూడా జరిగింది. ప్రతిదానికి డస్ట్ బిన్ డస్ట్ బిన్ అంటావ్ ఏంటి?? చిన్నదాన్ని పెద్దది చేస్తావ్ ఏంటని ప్రేరణ అడుగగా.. దానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తూ కరెక్ట్ పాయింట్ లాగింది సీత. మొన్న మీ టవల్‌ని పొరపాటుగా ఆదిత్య అన్న వాడుకున్నాడు. దానికి సారీ కూడా చెప్పాడు.. కానీ దాన్ని మీరు రచ్చ రచ్చ చేసి బిగ్ బాస్‌కి కంప్లైంట్ ఇచ్చారు.. కొత్త టవల్ తెప్పించుకున్నారు.. ఏ.. మీరు కూడా రచ్చ చేయకుండా.. ఆ టవల్‌ని ఉతుక్కుని వాడుకోలేకపోయారా? మీది ఇది పెద్ద ఇష్యూ అనిపించింది.. నాకు ఆ డస్ట్ బిన్ ఇష్యూ పెద్దగా అనిపించిందని అనేసరికి దెబ్బకి నోరు మూసేసింది ప్రేరణ. ఇక పృథ్వీని నబీల్, నైనిక నామినేట్ చేశారు. నిఖిల్ చీఫ్ గా ఫెయిల్ అయ్యావంటూ నబీల్ నామినేట్ చేశాడు. ఆదిత్య ఓంని అభినయ్ నవీన్ నామినేట్ చేసి.. అందరితో ఇంకా కలవాలని చెప్పి నామినేట్ చేశాడు.‌ ఇక నామినేషన్ లిస్ట్ లో ప్రేరణ ఉంది. కానీ విష్ణుప్రియ క్లైమాక్స్ లో ఆడ్ అయ్యింది.

యష్మీకి ఉన్న స్పెషల్ పవర్ గురించి బిగ్ బాస్ చెప్పిన ఆ క్షణంలోనే తన బెస్ట్ ఫ్రెండ్ ప్రేరణను సేవ్ చేసింది యష్మీ. అలానే నామినేషన్లలో లేని విష్ణుప్రియను డైరెక్ట్‌గా నామినేట్ చేసింది. ఇక దీనికి రీజన్‌గా యష్మీ చెప్పిన విషయం వింటే బుర్రతిరిగిపోద్ది. వాళ్లు లక్సరీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుండగా ఎవరైనా బాధపడుతున్నారని తెలిస్తే అది సరిగా ఎంజాయ్ చేయలేరట.. గేమ్‌పై కాన్సట్రేషన్ చేయలేరట.. ఈ కారణం చెప్పి విష్ణుప్రియని నామినేట్ చేసింది యష్మీ. దీంతో ఈ వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నామినేషన్ తో యష్మీ , ప్రేరణ, నిఖిల్, పృథ్వీ అంతా ఒక్కటే అని తెలుస్తోంది. మరి మీకేమనిపిస్తోందో కామెంట్ చేయండి.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...