English | Telugu

'అంతఃపురం'లో పాటొస్తే సాయికుమార్ భార్యకు కోపం ఎందుకంటే?

'అసలేం గుర్తుకు రాదు... నా కన్నుల ముందు నువ్వు ఉండగా' - కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'అంతఃపురం' సినిమాలో ఈ పాట సూపర్ హిట్. దానిని సాయికుమార్, సౌందర్యపై తెరకెక్కించారు. టీవీల్లో ఈ పాట వచ్చినప్పుడల్లా సాయికుమార్ భార్య సురేఖకు కోపం వస్తుంది. ఇదే విషయం డైలాగ్ కింగ్ ఎప్పుడూ కుటుంబ సభ్యులతో చెబుతుంటారట. ఎందుకు అంటే? 'అసలేం గుర్తుకు రాదు' పాట వచ్చిన ప్రతిసారీ తనను డాన్స్ చేయమని సాయికుమార్ అడుగుతుండటంతో కోపం వస్తుందని సురేఖ చెప్పారు. సాయికుమార్ 60వ పుట్టినరోజు సందర్భంగా 'వావ్' షోకు ఫ్యామిలీ మెంబర్స్ గెస్టులుగా వచ్చారు. అప్పుడు ఈ సంగతి సురేఖ బయటపెట్టారు.

సాయికుమార్ జీవితంలో జరిగిన ఓ సంఘటనను 'బొమ్మాళీ' రవిశంకర్ గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో తల్లి వేడినీళ్లు పోయడంతో సాయికుమార్ చెయ్యి పక్షవాతం వచ్చిన వ్యక్తి చేతిలా అయ్యిందట. అప్పుడు ఒక డాక్టర్ క్రికెట్ ఆడమని చెప్పడంతో ఆడారట. బౌలింగ్ చేయడంతో మళ్ళీ సరి అయ్యిందట. ఇంకా సాయికుమార్ ఫ్యామిలీలో పలు సంగతులను 'వావ్' షోలో ఆయన కుటుంబ సభ్యులు పంచుకున్నారు. తమ్ముళ్లు, చెల్లెళ్లు, పిల్లలు అందరూ షోకు వచ్చారు. ఆది సాయికుమార్ భార్య అరుణతో 'కోడలు అయిన తర్వాత భయం అన్నది పోవాలి' అని సాయికుమార్ అనడంతో ఆమె నవ్వేసింది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...