English | Telugu
వైరల్ వంటలక్క...త్వరలో
Updated : Nov 17, 2025
ఈటీవీలో అభిరుచి ప్రోగ్రాం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్నేళ్ల క్రితం వరకు ప్రతీ ఇంట్లోనూ అభిరుచి ప్రోగ్రాం కనిపించేది. ఐతే సోషల్ మీడియా కాలం బాగా పెరిగాకా చాలా కార్యక్రమాలు అటకెక్కిపోయాయి..ఇక ఇప్పుడు ఈటీవీ అభిరుచి ప్రేక్షకుల కోసం కొత్త షో ఒకటి త్వరలో రాబోతోంది. అదే "వైరల్ వంటలక్క". ఇక ధరణి ప్రియా ఈ షోని నిర్వహిచబోతోంది. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో వస్తున్న మాటలు, డైలాగ్స్, రీల్స్ లో వచ్చే కామెడీ బిట్స్ అన్నిటినీ కలిపి ఇక్కడే చూడొచ్చు. ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. "సరికొత్త వైరల్ అయ్యే వంటలతో మీముందుకొస్తోంది మీ వైరల్ వంటలక్క" అని చెప్పింది. ఇక వంటగదిలోకి రాగానే "నాకో గరిటెత్తిర్రా..స్పూన్ లు, గరిటెలు అనే పోపు డబ్బా ఒకటి ఉంటుంది దాన్ని ఇక్కడ పెట్టారా. అంటే అందరికీ కోపమొస్తుంది..హర్ట్ ఐపోతారు..తగలబెట్టండి అమర్ గారు తగలబెట్టండి.. నేను వంట చేస్తే మాములుగా ఉండదు..తిన్న వెంటనే అంటారు ఎవురమ్మా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు...వైరల్ వంటలక్కా..వైరల్ వంటలవుతాయి...మాటలు మంటలవుతాయి.
వెరైటీగా నేను చేసే వెజ్ వంటలు చూసి అంటారు వాట్ ఏ విజన్..ఇక నాన్ వెజ్ వంటకాలు ఎలా ఉంటాయంటే రెండు లివర్ లు ఎక్స్ట్రా...మా ఆయన బిజినెస్ ట్రిప్ మీద బ్యాంకాక్ వెళ్ళాడు వదినా రావడానికి ఇంకో వారం పట్టుదట...ఫామిలీ ఫామిలీ అని ఒకటే అల్లాడిపోతాడొదినా...ఏంటి అలా చూస్తున్నారు కింది స్థాయి వాళ్లకు అర్ధం కానీ మినిమం డిగ్రీ చదివుండాలి. వైరల్ అయ్యే వంటలతో పాటు ఫామిలీ టాపిక్స్ నుంచి ఫారెన్ టారీఫ్స్ వరకు మాట్లాడుతుంది మీ వైరల్ వంటలక్క...అవునా నిజమా" అంటూ చెప్పుకొచ్చింది ధరణి ప్రియా.