English | Telugu
ప్రేమలేఖ తెచ్చిన తంటా..వేదకు యష్ ఫుల్ క్లాస్
Updated : May 17, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓ పాప, ఆ పాప కోసం తపించే ఓ యువతి.. పాప కోసం తపించే యువదిని పెళ్లాడిన పాప తండ్రి .. ఈ ముగ్గురు పాత్రల నేపథ్యంలో సాగే భావోద్వేగాల సమాహారంగా ఈ సీరియల్ సాగుతోంది. స్టార్ ప్లస్ లో ఏడేళ్ల క్రితం ప్రసారం అయిన హిందీ సీరియల్ `ఏ హై మొహబ్బతే` ఆధారంగా ఈ సీరియల్ ని తెలుగులో రీమేక్ చేశారు.
నిరంజన్, డెబ్జాని మోడక్, మిన్ను నైనిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర పాత్రల్లో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, మీనాక్షి, ఆనంద్ తదితరులు నటించారు. గత కొన్ని వారాలుగా విజయవంతంగా సాగుతున్న ఈ సీరియల్ మంగళ వారం ఆసక్తికర మలుపులు తిరగబోతోంది. ప్రేమలేఖ ని వసంత్ చిత్రకు రాస్తే ఆ లెటర్ వేదకు చేరుతుంది. అయితే అది రాసింది తన భర్త యష్ అనుకుని పొరపాటు పడిన వేద అప్పటి నుంచి యష్ కనిపించగానే మెలికలు తిరుగుతూ ఎక్కడ తనని ఏదైనా చేస్తాడేమోనని తెగ కంగారు పడుతూ వుంటుంది.
టిఫిన్ పెట్టమంటే అష్టవంకర్లు తిరుగుతూ చివరికి టిఫిన్ పెట్టేసి టక్కున అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తరువాత యష్ ఆఫీస్ కి వెళుతూ టాటా చెబుతుంటే అది కూడా తననే అనుకుని పొరపాటు పడుతుంది. ఈ మనిషికి ఏమైంది. ప్రేమలేఖ రాశాడు..అప్పటి నుంచి చిత్ర విచిత్రంగా తనని దగ్గర చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడని వేద తనతో తానే మాట్లాడుకుంటుంది. ఆఫీస్ కి వెళ్లిన యష్ కడుపు నొప్పి అంటూ వేద హాస్పిటల్ కు వస్తాడు. ఇదొక వంకతో తన కోసమే వచ్చాడని వేద ప్పులో కాలేస్తుంది. అప్పుడే తనకు లవ్ లెటర్ రాశావని యష్ ని నిలదీస్తుంది.
లెటర్ తెచ్చి చూపించే సరికి అసలు విషయం యష్ గ్రహిస్తాడు. వసంత్ రాసిన లెటర్ ని తను రాసినట్టుగా ఫీలవుతున్నావని, లవ్ లెటర్ ఈ జన్మలో నీకు రాయనని అంటాడు యష్ దాంతో వేద యష్ ముందు అడ్డంగా బుక్కవుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? వేద, యష్ ల మధ్య ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.