English | Telugu
నిరుపమ్ పర్ఫార్మెన్స్ చూసి ఉమాదేవికి కన్నీళ్లు ఆగలేదు!
Updated : Jul 19, 2021
'కార్తీక దీపం' కథానాయకుడు నిరుపమ్ పరిటాల.. అందులో తన ఇద్దరు కూతుళ్లుగా నటిస్తోన్న కృతిక (శౌర్య), సహృద (హిమ)లతో కలిసి పరివార్ చాంపియన్‌షిప్ స్పెషల్ షో కోసం చేసిన పర్ఫార్మెన్స్ ఆ సీరియల్ నటి ఉమాదేవి (భాగ్యం)ను ఎమోషనల్‌కు గురిచేసి, ఏడిపించేసింది.
లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ఆ షో ప్రోమోలో 'కార్తీక దీపం' సీరియల్ ప్లాట్ నేపథ్యంలో నిరుపమ్ ఓ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అందులో బ్యాగ్రౌండ్‌లో, "డాక్టర్‌గారూ మీరు నాకు న్యాయం చెయ్యాలనుకుంటే మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డకు అన్యాయం జరుగుతుంది. మోనితకు న్యాయం చేస్తే నా బిడ్డలకు అన్యాయం జరుగుతుంది." అంటూ దీప వాయిస్ వినిపిస్తుంది. ఆ తర్వాత డాన్సర్స్‌తో నిరుపమ్ చేసిన యాక్ట్ అందర్నీ కదిలించి వేసిందనీ, వాళ్లంతా భావోద్వేగానికి గురయ్యారనీ అర్థమవుతోంది.
ఈ పర్ఫార్మెన్స్‌పై ఉమాదేవి మాట్లాడుతూ, "అమ్మాయిలు ఫాదర్ కోసం తపిస్తున్నారు.. ఎప్పుడు మా పేరెంట్స్ కలిస్తే మేం సరదాగా ఉంటాం అని. ఆ పెయిన్‌ను నిజం జీవితంలో నేను అనుభవిస్తున్నాను." అని దుఃఖం ఆపుకోలేకపోయింది. ఆమెను పక్కనే కూర్చొనివున్న కార్తీకదీపం మోనిత ఓదార్చడం గమనార్హం. ప్రోమోలో ఉమాదేవి చెప్పిన దాన్ని బట్టి చూస్తే రియల్ లైఫ్‌లో ఆమె చాలా వేదనను అనుభవిస్తోందని తెలుస్తోంది.
'పరివార్ చాంపియన్‌సిప్' వచ్చే ఆదివారం (జూలై 25న)న సాయంత్రం 6 గంటలకు స్టార్ మా చానల్‌లో ప్రసారం కానున్నది. సుమ, శ్రీముఖి హోస్టులుగా వ్యవహరించే ఈ షోలో కార్తీక దీపం, వదినమ్మ, దేవత, జానకి కలగనలేదు, గుప్పెడు మనసు తదితర సీరియల్స్‌లో నటించే 50 మందికి పైగా టీవీ తారలు 18 సూపర్బ్ పర్ఫార్మెన్సులతో ఆకట్టుకోనున్నారు. అలాగే జబర్దస్త్ అవినాష్, హరి లాంటి కమెడియన్లు తమ స్కిట్లతో నవ్వించనున్నారు.