English | Telugu

'కార్తీకదీపం' ట్విస్ట్‌: ప్రియమణి కాదు... పైడమ్మ!

ప్రియమణి... పేరు అందంగా ఉంది కదూ! 'కార్తీక దీపం'లో ప్రియమణి పాత్రలో నటిస్తున్న శ్రీదివ్య కూడా అందంగానే ఉంటుంది. కనిపించేది పనిమనిషి పాత్రలో అయినప్పటికీ... ఆమెకు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆ పేరుకు. అయితే, ప్రియమణి అసలు పేరు పైడమ్మ అని రివీల్ చేయడం 'కార్తీక దీపం' సీరియల్ ప్రేక్షకులకు లేటెస్టుగా తగిలిన షాక్.

రోజుకొక ఆసక్తికర మలుపుతో 'కార్తీక దీపం' ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సాగుతుంది. ఈమధ్య కార్తీక్ మీద మోనిత కేసు పెట్టిన సంగతి తెలిసిందే. కేసును టేకప్ చేసిన ఏసీపీ రోషిణి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. అందులో భాగంగా మోనిత ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న ప్రియమణిని విచారణకు పిలుస్తుంది. అప్పుడు 'నీ అసలు పేరు చెప్పు?' అని గట్టిగా అడిగేసరికి 'పైడమ్మ' అని చెప్పడంతో ఆడియన్స్ షాక్ అవుతారు.

ఇంటికి వెళ్లి విచారణ సంగతి మోనితకు చెబుతుంది పైడమ్మ. కార్తీక్, దీపకు రోహిణి సపోర్ట్ చేస్తే... తనకు ఎప్పటికీ కార్తీక్ దక్కకుండా పోతాడని మోనిత భయపడుతుంది. సీన్ రివర్స్ కాకుండా తనను కార్తీక్ పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలోనని మథనపడటం మొదలుపెడుతుంది. ఆ త‌ర్వాత ఆమె ఏం చేసిందో చూడాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...