English | Telugu

అద్దాలు తుడిచి క‌డుపు నింపుకున్న క‌మెడియ‌న్‌

సినీ ప‌రిశ్ర‌మ ఓ రంగుల ప్ర‌పంచం. ఇందులో కల‌ర్ ఫుల్ జీవితాలే కాదు.. కారు చీక‌ట్లో దుర్భ‌ర జీవితాన్ని అనుభవించి ఆ త‌రువాత అదృష్టం, కాలం, క‌ష్టం క‌లిసిరావ‌డంతో మంచి స్థాయికి వెళ్లిన వాళ్లు ఇండ‌స్ట్రీలో చాలా మంది వున్నారు. కోటి ఆశ‌ల‌తో సినీ రంగంలోకి ప్ర‌వేశించాల‌ని ఇళ్లు వ‌దిలి, పుట్టిన ఊరు విడిచి భాగ్య‌న‌గరానికి వ‌చ్చిన ఎంతో మంది తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొని ఆ త‌రువాత కృషితో పైకొచ్చిన పేరు తెచ్చుకున్న వారే. అలాంటి వ్య‌క్తుల్లో నేనూ ఒక‌డిని అంటున్నారు క‌మెడియ‌న్ స‌త్య‌.

మంచి టైమింగ్ తో పంచ్ లు వేసే స‌త్య కెరీర్ తొలినాళ్లలో దుర్భ‌ర జీవితాన్ని ఎదుర్కొన్నార‌ట‌. సినిమాల మీద మ‌క్కువ‌తో ఇంజ‌నీరింగ్ ను స‌గంలోనే ఆపేసి హైద‌రాబాద్ బాట ప‌ట్టిన స‌త్య వ‌చ్చే ముందు త‌న తండ్రి ఇచ్చిన 10 వేల‌తో వ‌చ్చార‌ట‌. ఆ డ‌బ్బులు అయిపోయిన త‌రువాత స‌త్య‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయ‌ట‌. డ‌బ్బుల కోసం ఓ ఆసుప‌త్రిలో అద్దాలు తుడిచార‌ట‌. దానికి ఆయ‌న‌కు రోజుకి రెండు వంద‌లు ఇచ్చేవార‌ట‌.

Also read: సిక్స్ కొట్ట‌బోతున్న పూజా హెగ్డే!

త‌ను ప‌నిచేసిన చోటే ఇద్ద‌రు జూనియ‌ర్ ఆర్టిస్ట్ లు ప‌రిచ‌యం అయ్యార‌ట‌. వారితో క‌లిసి షూటింగ్ చూడ్డానికి వెళితే అక్క‌డ కొంత మంది ఐదు వంద‌లు తీసుకుని షూటింగ్ చూడ‌టానికి పంపించార‌ట‌. ఆ స‌మ‌యంలో మ‌రి కొంద‌రు జూనియ‌ర్ ఆర్టిస్టులు ప‌రిచ‌యం అయ్యార‌ట‌. ఓ సారి ఓ జూనియ‌ర్ ఆర్టిస్ట్ స‌త్య ద‌గ్గ‌ర వున్న డ‌బ్బులు కొట్టేశాడ‌ట‌. చివ‌ర‌కు డ‌బ్బులు లేక‌పోతే మూడు రోజుల పాటు నీళ్లు తాగి ఆక‌లి తీర్చుకున్నార‌ట స‌త్య‌.

త‌ర్వాత త‌న ఇబ్బందులను త‌ల్లికి ఫోన్లో వివ‌రించార‌ట‌. చివ‌రకు తెలిసిన వాళ్ల స్నేహితుల ద్వారా `ద్రోణ‌` సినిమాకు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో చేర‌డ‌ట స‌త్య‌. అలా కొన్ని రోజులు ద‌ర్శ‌కత్వ శాఖ‌లో ప‌నిచేసిన త‌రువాత న‌టుడిగా మారారు స‌త్య‌. ప్ర‌స్తుతం క‌మెడియ‌న్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...