English | Telugu

బిగ్ బాస్ ఓటీటీ హంగామా మొద‌లైందిగా

బిగ్‌బాస్ సీజ‌న్ లు చేస్తున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. వ‌రుస కాంట్ర‌వ‌ర్సీల‌తో స‌రికొత్త వివాదాల‌కు తెర‌తీస్తూ పాపులారిటీని సొంతం చేసుకుంటున్నాయి. తెలుగులో ఇప్ప‌టికే ముగిసిన బిగ్‌బాస్ సీజ‌న్ 5 చేసిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. ఏకంగా ల‌వ్ బ‌ర్డ్స్ బ్రేక‌ప్ చెప్పుకునేలా చేసింది. ఇక ఓటీటీలో 24 గంట‌ల హంగామా అంటూ మ‌రో కొత్త అంకానికి తెర‌లేపుతుండ‌టంతో ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ఎలాంటి వివాదాల‌ని సృష్టిస్తారో అని అప్పుడే చ‌ర్చ మొద‌లైంది.

తెలుగు ఓటీటీ బిగ్‌బాస్ సీజ‌న్ గురించి ప్ర‌క‌ట‌న అయితే వ‌చ్చింది కానీ ఇంత వ‌ర‌కు కంటెస్టెంట్ ల‌కు సంబంధించిన వార్త‌లు మాత్రం ఇంకా బ‌య‌టికి రావ‌డం లేదు. అదిగో.. ఇదిగో అంటూ... ఊరిస్తున్నారే కానీ ఫైన‌ల్ కంటెస్టెంట్ ల వివ‌రాల‌ని మాత్రం రివీల్ చేయ‌డం లేదు. తెలుగు ఓటీటీ బిగ్‌బాస్ ప‌రిస్థితి ఇలా వుంటే త‌మిళ ఓటీటీ బిగ్‌బాస్ మాత్రం జోరుగా ముందుకు దూసుకుపోతోంది. వ‌రుస అప్ డేట్ ల‌తో హోరెత్తిస్తోంది.

ఇప్ప‌టికే ఇద్ద‌రు కంటెస్టెంట్ ల‌ని అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించేశారు కూడా. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏంటంటే గ‌త సీజ‌న్ లో మెరిసిన కంటెస్టెంట్ ల‌నే ఓటీటీ కోసం తీసుకుంటున్నారు. తాజాగా మూడ‌వ కంటెస్టెంట్ గా వ‌నిత విజ‌య్ కుమార్ ని క‌న్ఫ‌మ్ చేశారు. వ‌నిత సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. పెళ్లిళ్ల విష‌యంలోనూ వ‌నిత వార్త‌ల్లో నిలిచి వైర‌ల్ గా మారిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమెని ఓటీటీ బిగ్‌బాస్ కోసం ఎంచుకుంటే మైలేజ్ మామూలుగా వుండ‌ద‌ని గ్ర‌హించిన బిగ్‌బాస్ నిర్వాహ‌కులు వ‌నిత‌ని ఫైన‌ల్ చేశారు.

Also Read:దీప‌కు అడ్డంగా దొరికిపోయిన డాక్ట‌ర్ బాబు

తాజాగా ఆమెకు సంబంధించిన ప్రోమోని కూడా వ‌దిలారు. `న‌ర‌సింహ` సినిమాలో ర‌మ్య‌క‌ష్ణ ప‌దే ప‌దే పెళ్లి సీన్ ను టీవీలో చూస్తుంటుందో అలాగే వ‌నిత త‌న ఎలిమినేష‌న్ కు సంబంధించి క‌మ‌ల్ హాస‌న్ చేసిన ప్ర‌క‌ట‌నకు సంబంధించిన వీడియోని రిపీట్ మోడ్ లో చూస్తుంటుంది. ఆ సీన్ ఏం చూస్తాం బిగ్‌బాస్ ఓటీటీలోకి వ‌చ్చేసేయ్ అని బిగ్‌బాస్ వాయిస్ రావ‌డం..వ‌నిత రెడీ అయిపోయి ఎంట్రీకి సిద్దం కావ‌డంతో ప్రోమో ఎండ్ అయింది. రెడ్ క‌ల‌ర్ థీమ్ లో చిత్రీక‌రించిన ఈ ప్రోమో ఆక‌ట్టుకుంటోంది. త‌మిళ్ ఓటీటీ బిగ్‌బాస్ హంగామా మొద‌లైంది మ‌రి మ‌న బాస్ ఇంకా మొద‌లెట్ట‌డే అంటూ మ‌న వాళ్లు సెటైర్లు వేస్తున్నారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...