English | Telugu
Suman Shetty Bigg Boss 9 Telugu: కెప్టెన్సీ రేస్ నుండి సుమన్ శెట్టి అవుట్.. పోరాడి ఓడాడుగా!
Updated : Nov 27, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ ముగిసింది. ఇక సీరియస్ గేమ్ మొదలైంది. కంటెస్టెంట్స్ మధ్య తీవ్రమైన ప్రెషర్ ఉంది. ఏ టాస్క్ లోను ఎవరు తగ్గడం లేదు. అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ డిఫరెంట్ గా ఫ్లాన్ చేశాడు బిగ్ బాస్. ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్లలోని కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించి వారితో కంటెస్టెంట్స్ ని కెప్టెన్సీ టాస్క్ ఆడిస్తున్నాడు.
మొదటగా ప్రియాంక జైన్ రాగా తను కల్యాణ్ తో ఆడింది. అందులో కళ్యాణ్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ట ఎంట్రీ ఇచ్చాడు. తను భరణితో ఆడి గెలిచాడు. ఇక భరణి కెప్టెన్సీ రేస్ నుండి అవుట్ అయ్యాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో దేత్తడి హారిక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దేత్తడి హారిక ఫేస్ మొత్తం కవర్ చేస్తూ చీర కొంగుని వేసుకొని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తనని గుర్తుపట్టమని దేత్తడి హారిక అనగా కాసేపటి దాకా ఎవరు గుర్తుపట్టరు. దాంతో తనే హింట్ ఇస్తుంది. సీజన్-4 కంటెస్టెంట్ అనగానే అందరు ఆలోచనలో పడగా .. ఏయ్ దేత్తడి అని ఇమ్మాన్యుయల్ అనగా.. ఎస్ ఇమ్మూ అని దేత్తడి హారిక అంటుంది. ఇక అందరి గురించి చెప్పుకొచ్చింది దేత్తడి హారిక. భరణి గారిని హగ్ చేసుకోవచ్చా అంటూ దివ్యని , తనూజని అడిగింది దేత్తడి. రీతూ దగ్గరికి రాగానే.. వచ్చిందండి వయ్యారి.. ఇప్పుడే అడుగుతున్నా అంటూ సెటైర్ వేసింది దేత్తడి. ఇక రీతు నవ్వేసింది.
కెప్టెన్సీ కంటెండర్ కోసం నీతో ఆడటానికి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నావని దేత్తడి హారికని బిగ్ బాస్ అడుగగా.. సుమన్ శెట్టి అని చెప్పింది. ఇక కాసేపటికి బిగ్ బాస్ ఇద్దరికి టవర్ టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో టాస్క్ సంబంధించిన అన్ని పెట్టేసి, రూల్స్ చెప్పేసి సంఛాలక్ గా ఎవరిని తీసుకుంటావని హారికని బిగ్ బాస్ అడుగగా.. తను భరణిని సంచాలకులుగా ఉంటారని అంది. ఇక టాస్క్ మొదలైంది. ఫస్ట్ ఆఫ్ వరకు సుమన్ శెట్టి బాగా ఆడాడు. ఇక ఇద్దరు టవర్ పేర్చారు. ఎప్పుడైతే సుమన్ శెట్టి టవర్ కిందపడుతుందో అప్పుడే బజర్ మోగించాడు బిగ్ బాస్ మామ. దాంతో ఈ టాస్క్ లో దేత్తడి హారిక గెలిచింది. సుమన్ శెట్టి కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకున్నాడు. అయితే ఫస్టాఫ్ వరకు సుమన్ శెట్టి గెలుస్తాడని అనుకున్నారంతా అంత బాగా ఆడాడు.. కానీ టవర్ పై ఇంకో బాల్ పెట్టగానే అది కూలిపోయింది.. ఆ బాల్ పెట్టకుండా ఉండి ఉంటే సుమన్ శెట్టి గెలిచేవాడు కెప్టెన్సీ రేస్ లో నిలిచేవాడు. సుమన్ శెట్టి పోరాడాడు కానీ జస్ట్ కొంచెంలో మిస్ అయ్యాడు.