English | Telugu

వేద త‌ల్లి కార‌ణంగా అడ్డంగా బుక్కైన య‌శోధ‌ర్‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తున్న ధారావాహిక `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్‌, మిన్ను నైనిక‌, బెంగ‌ళూరు ప‌ద్మ‌, ఆనంద్‌, శ్రీ‌ధ‌ర్ జీడిగుంట ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గ‌త కొన్ని వారాలుగా `స్టార్ మా` లో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. బిజినెస్ మెన్ అభిమ‌న్యు - మాళ‌విక‌ (య‌శోధ‌ర్ మాజీ భార్య‌) కార‌ణంగా చిత్ర విచిత్ర‌మైన మ‌లుపులు తిరుగుతున్న ఈ సీరియ‌ల్ బుధ‌వారం మ‌రింత ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌ల‌తో ట్విస్ట్ ఇవ్వ‌బోతోంది.

త‌న బిజినెస్ పార్ట్న‌ర్ వేద‌ని య‌ష్ భార్య‌గా అనుకుంటారు. కానీ ఆ విష‌యం తెలియ‌కుండా య‌ష్ మేజ్ చేస్తాడు. ఎలాగైనా త‌న‌కు కాంట్రాక్ట్ ద‌క్కాల‌ని వేద‌ని త‌న భార్య‌గా న‌టించ‌మ‌ని కోర‌తాడే య‌ష్‌. ఖుషీ కోసం త‌ను కాద‌న‌లేక‌పోతుంది. అయితే సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్ కోసం య‌ష్ ఇంటికి త‌న భార్య‌తో క‌లిసి వ‌చ్చిన బిజినెస్ పార్ట్న‌ర్ (రాజా శ్రీ‌ధ‌ర్‌) కు వేద నిజంగా య‌ష్ భార్య కాద‌ని, కాంట్రాక్ట్ కోస‌మే య‌ష్ - వేద‌తో క‌లిసి త‌న ముందు నాట‌కం ఆడుతున్నాడ‌ని వేద త‌ల్లి ద్వారా తెలుస్తుంది.

Also read: 'బంగార్రాజు' విజయం వెనుక సీఎం జగన్ ఉన్నారు!

త‌న కూతురు వేద‌కు అస‌లు పెళ్లే కాలేద‌ని, త‌న కూతురుకు య‌ష్ భ‌ర్త కాద‌ని. కాంట్రాక్ట్ కోస‌మే త‌న కూతురిని అమాయ‌కురాలిని చేసి నాట‌కం ఆడుతున్నాడ‌ని య‌ష్ ని అడ్డంగా బుక్ చేస్తుంది. దీంతో ఆగ్ర‌హించిన బిజినెస్ పార్ట్న‌ర్ (రాజా శ్రీ‌ధ‌ర్‌) ...య‌ష్ కు ఇవ్వాల‌నుకున్న కాంట్రాక్ట్ పేప‌ర్స్ ని చించేయాల‌నుకుంటాడు. త‌న కాంట్రాక్ట్ ని ర‌ద్దు చేయాల‌నుకుంటాడు. ఆవేశంతో ఊగిపోతూ య‌ష్ పై సీరియ‌స్ అవుతాడు. అయితే అప్పుడు వేద ఏంచేసింది? .. య‌ష్ కు అండ‌గా నిలిచిందా? .. త‌న ప్ర‌వ‌ర్త‌న బిజినెస్ పార్ట్న‌ర్ (రాజా శ్రీ‌ధ‌ర్‌)లో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...