English | Telugu

సుధీర్‌, ర‌ష్మీ జోడీ లేకుంటే 'ఢీ' ప‌రిస్థితి?

జ‌బ‌ర్ద‌స్త్, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్, ఢీ షోల‌కు మంచి క్రేజ్ ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే ఆ క్రేజ్ తాజా 'ఢీ' షోకు క‌నిపించ‌డం లేదు. కార‌ణం ఈ షోలో క్రేజీ జోడీలు క‌నిపించ‌క‌పోవ‌డ‌మే. ప్ర‌ధానంగా ఈ షోలో సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్ లేరు. అదే ఈ షోకి పెద్ద మైన‌స్ గా మారుతోంది. వీరు లేని లోటు కొట్టొచ్చిన‌ట్టుగా క‌నిపిస్తోంది. 'ఢీ' షోలో వీరిద్ద‌రుంటే ఆ క‌ల‌రింగే వేరు.. ఇద్ద‌రి మ‌ధ్య న‌డిచే ల‌వ్ ట్రాక్‌, వీరి కెమిస్ట్రీ.. వీరిపై షూట్ చేసే రొమాంటిక్ ల‌వ్ సాంగ్స్.. వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకునేవి.

`ఢీ` షోల‌కి ప్ర‌త్యేక ఫ్యాన్ ఫాలోయింగ్, రేటింగ్ వున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్ప‌డ‌ది మ‌స‌క‌బారిన‌ట్టుగా క‌నిపిస్తోంది. కార‌ణం తాజాగా ప్రారంభించిన `ఢీ 14` ది డ్యాన్సింగ్ ఐకాన్ షోలో ఈ జంట లేక‌పోవ‌డ‌మే. దీంతో షోలో రొమాన్స్ క‌నిపించ‌డం లేదు. ఎంట‌ర్ టైన్‌మెంట్ అస్స‌లే లేదు. దీంతో ఈ షో రేటింగ్ దారుణంగా ప‌డిపోతోంద‌ని చెబుతున్నారు.

Also Read:"నా వెనుక నిలిచింది నా తండ్రి ప్రేమ‌!" వైర‌ల్ అయిన‌ దీప్తి ఎమోష‌న‌ల్ పోస్ట్‌!!

ఈ షో నుంచి సుడిగాలి సుధీర్‌, ర‌ష్మిని త‌ప్పించి ర‌వికృష్ణ‌, బిగ్‌బాస్ ఫేమ్ అఖిల్‌, హైప‌ర్ ఆది, సుస్మిత‌, దివి ల‌ను దించేశారు. అయినా వ‌ర్క‌వుట్ కాలేదు. మొన్న‌టి 'ఢీ' షోకి రేటింగ్ కేవ‌లం 3.5 మాత్ర‌మే వ‌చ్చింది. దీంతో మేక‌ర్స్ ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ర‌ష్మీ - సుధీర్ జోడీ లేని లోటుని డ్యాన్స‌ర్స్ సాయి, నైనిక‌ల‌తో భ‌ర్తీ చేయాల‌ని పులిహోర క‌లిపారు.. ఆ త‌రువాత ర‌వికృష్ణ‌, సుస్మిత‌ల మ‌ధ్య కూడా ల‌వ్ ట్రాక్ స్టార్ట్ చేయాల‌నుకున్నారు .అయితే ఇవేవీ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. ఈ షో చూసిన ఫ్యాన్స్ మాత్రం ర‌ష్మి - సుధీర్ రావాల్సిందే అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మ‌రి మేక‌ర్స్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...