English | Telugu

భారీ-క్రేజీ సినిమాల‌న్నీ 'స్టార్ మా'కే!

ఈరోజుల్లో నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా నిర్మాతలు భారీ లాభాలను పొందుతున్నారు. ఓటీటీ హక్కుల్లో ఎంత పోటీ ఉందో శాటిలైట్ హక్కుల్లో కూడా అంతే పోటీ నెలకొంది. ఇక అందులో స్టార్ మా ఛానెల్ శాటిలైట్ హక్కులను అందుకోవడంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో పాటు రాబోయే ఆసక్తికర సినిమా హక్కులను కూడా స్టార్ మా సొంతం చేసుకుంది.

ఒకప్పుడు సినిమా విడుదలైన చాలా కాలానికి టీవీల్లో వచ్చేది. కానీ ఈరోజుల్లో మాత్రం రెండు, మూడు వారాల తరువాత ఓటీటీల్లోకి వచ్చేస్తుంది. ఆ తరువాత టీవీలలో టెలికాస్ట్ అవుతున్నాయి. ఇప్పుడు స్టార్ మా సినిమాలపై పెట్టుబడులు గట్టిగానే పెడుతోంది. స్టార్ మా ముందుగా రెండు పాన్ ఇండియా సినిమాలను దక్కించుకోవడం విశేషం. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ తెరకెక్కుతోన్న 'ఆర్ఆర్ఆర్' శాటిలైట్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేశారు.

ఇక సూప‌ర్ క్రేజీ ప్రాజెక్టుల్లో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మరో పాన్ ఇండియా సినిమా 'పుష్ప' హక్కులు, మ‌హేశ్‌బాబు - ప‌ర‌శురామ్ కాంబినేష‌న్ ఫిల్మ్ 'స‌ర్కారువారి పాట' హ‌క్కుల‌ను కూడా సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా 'అఖండ'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా హక్కులను కూడా దక్కించుకుంది 'స్టార్ మా'. వీటితో పాటు మీడియం బడ్జెట్ సినిమాలను కూడా స్టార్ మా వదలడం లేదు. 'ఖిలాడి', 'లవ్ స్టోరీ', 'టక్ జగదీశ్', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' హక్కులను కూడా దక్కించుకుంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...