Read more!

English | Telugu

వైరల్ అయిన శ్రీహాన్ ఫ్యాన్ రాసిన నోట్!

బిగ్ బాస్ లో నిన్న జరిగిన టికెట్ టు ఫినాలే టాస్క్ లో రేవంత్, శ్రీహాన్ ‌ఉండగా శ్రీహాన్ గెలిచిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తాజాగా ఒక ఫ్యాన్ శ్రీహాన్ కి గ్రాండ్ వెల్ కమ్ లేదు. గెలిచిన సంతోషం కూడా లేదు అంటూ ఒక నోట్ రాసింది. కాగా ఇప్పుడు ఇది వైరల్ అయ్యింది.

ప్రతీ సీజన్ లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ గెలిచిన వారికి గ్రాండ్ వెల్ కమ్ ఉంటుంది. ఇంకా ఒక స్పెషల్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. అలాంటిది శ్రీహాన్ కి ఏమీ లేదు. కాగా కంగ్రాట్స్ మాత్రమే చెప్పాడు నాగార్జున. ఆ తర్వాత "రేస్ నుండి నువ్వు తప్పుకుంటున్నట్లు చెప్పడం ఏదైతే ఉందో అది బెస్ట్ డెసిషన్ రోహిత్" అంటూ రోహిత్ ని పొగిడాడు. అలాగే ది బెస్ట్ కెప్టెన్ ఇనయా అంటూ హౌస్ మేట్స్ అందరితో క్లాప్స్ కూడా కొట్టించాడు నాగార్జున.

ఫ్యాన్ రాసిన నోట్ లో ఏం ఉందంటే.. "టికెట్ టు ఫినాలే శ్రీహాన్ కి వచ్చిన హ్యాపీనెస్ లేకుండా అయింది నిన్నటి ఎపిసోడ్ లో. అయినా టికెట్ టు ఫినాలే అంటే ఇలా వేస్తారా.. ఒక స్పెషల్ ఎపిసోడ్ కూడా వేయకుండా.. అదేలే శ్రీహాన్ కి కదా వచ్చింది. అందుకే హైప్ లేదు. ఇంకెవరికైనా వచ్చి ఉంటే ఫుల్ హైప్ ఎపిసోడ్స్ వేసేవాళ్ళు.. ఇనయాకి కెప్టెన్సీ ఎపిసోడ్స్ హైప్ వచ్చినట్లు. ఏం పర్లేదు శ్రీహాన్.. నీ హ్యాపీనెస్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడూ ఉంటాం" అంటూ రాసుకొచ్చింది శ్రీహాన్ ఫ్యాన్.