English | Telugu

Karthika Deepam2 : దీప కడుపులోని బిడ్డకి జ్యోత్స్న వల్ల ముప్పు.. కార్తీక్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -526 లో.. కార్తీక్ తో శివన్నారాయణ పంతులు చెప్పిన విషయం చెప్పి టెన్షన్ పడతాడు. నువ్వేం కంగారుపడకు తాత.‌ నేను ఉన్నానని కార్తీక్ దైర్యం చెప్తాడు. ఆ తర్వాత మా మమ్మీ నన్ను కొట్టడం ఏంటని జ్యోత్స్న అనగానే నువ్వు మాట్లాడింది తప్పు అని పారిజాతం అంటుంది. దాంతో జ్యోత్స్న కోపంగా ఇప్పుడు చెప్పు అని తన పీకపై కత్తి పెట్టి మరి జ్యోత్స్న అడుగుతుంది. అయినా తప్పు నీదే అని పారిజాతం అంటుంది.

అసలు ఆ దీప కడుపులో బిడ్డని బ్రతనివ్వనని జ్యోత్స్న అనగానే పారిజాతం షాక్ అవుతుంది. తప్పుగా మాట్లాడితేనే సిచువేషన్ ఇలా ఉంది.. లేకుండా చేస్తే ఇంకెలా ఉంటుందని పారిజాతం అంటుంది. నువ్వు పిల్లలని మార్చావ్ ఏమైనా అయిందా అని జ్యోత్స్న అనగానే అప్పుడు కార్తీక్ గాడు చిన్నోడు ఇప్పుడు వాడిని ఎదుర్కోవడం కష్టమని పారిజాతం అంటుంది. మరొకవైపు దీప, కార్తీక్ ల దగ్గరికి సుమిత్ర వచ్చి మీరు జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారు నాకు తెలుసు.. దానికి సారీ అని చెప్తుంది. జ్యోత్స్నకి కోపం కాదు ఈర్ష్య మాత్రమే ఎందుకంటే కార్తీక్ ని తను పెళ్లి చేసుకునేది కానీ నువ్వు చేసుకున్నావ్ కాబట్టి దానికి అలా అని చెప్తుంది. ఈ టైమ్ లోనే పేరెంట్స్ నీ దగ్గర ఉండాలని అనుకుంటావ్ కానీ రెండు ప్రేమలని చూపించడానికి కార్తీక్ ఉన్నాడని సుమిత్ర అంటుంది.

ఆ తర్వాత శ్రీధర్ ఫైల్ పట్టుకొని శివన్నారాయణ దగ్గరికి వస్తాడు. కంపెనీ అకౌంట్ నుండి రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలు జ్యోత్స్న అకౌంట్ కి ట్రాన్స్‌ఫర్ అయ్యాయని చెప్తాడు. ఏం చేసావని జ్యోత్స్నని శివన్నారాయణ అడుగుతాడు. ల్యాండ్ తీసుకున్న అమ్మకి పెళ్లి రోజు గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నానని జ్యోత్స్న చెప్తుంది మరి ఎందుకు ఇవ్వలేదని కార్తీక్ అడుగుతాడు. సిచువేషన్ బాలేదు కదా మళ్ళీ ఇచ్చే సిచువేషన్ రాలేదని జ్యోత్స్న అనగానే అబద్ధం అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.