English | Telugu

స్టేజ్ పైనే శేఖర్‌కి శ్రీముఖి ముద్దులు!.. మాస్ట‌ర్ భార్య ప‌రిస్థితేమిటో..!!

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో యాంకర్ శ్రీముఖి చాలా సన్నిహితంగా మెలుగుతుంటుంది. ఇద్దరూ కలిసి డాన్స్ వీడియోలు కూడా చేస్తుంటారు. అయితే తాజాగా ఓ టీవీ షోలో ఏకంగా స్టేజ్ మీదే శేఖర్ మాస్టర్ కు ముద్దులు పెట్టి షాకిచ్చింది శ్రీముఖి. ఓంకార్ హోస్ట్ చేస్తోన్న సిక్స్త్ సెన్స్ నాల్గో సీజన్ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్ కి అనసూయ-హైపర్ ఆదిలు గెస్ట్ లుగా రాగా.. రెండో ఎపిసోడ్ కి శేఖర్ మాస్టర్-శ్రీముఖిలను తీసుకొచ్చారు ఓంకార్.

రెండు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఓంకార్ ఎలాంటి ఫిట్టింగ్ పెట్టారో తెలియదు కానీ.. శ్రీముఖి స్టేజ్ పైనే శేఖర్ మాస్టర్ కి గ్యాప్ ఇవ్వకుండా ముద్దులు పెట్టేసింది. వెంటనే శేఖర్ మాస్టర్ భార్య ఏమనుకుంటుందో అని.. 'మీ భార్య పేరేంటి..?' అని శేఖర్ మాస్టర్ ని అడిగి.. 'ఇది షోకి సంబంధించింది.. అన్నీ కల్పితాలే' అని చెప్పింది. నిజంగా ముద్దు పెట్టలేదని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది.

కేవలం ముద్దులతో ఆగిపోలేదు. 'గిరా గిరా తిరిగే నడుము ఇది' అంటూ శ్రీముఖి నడుం దగ్గర శేఖర్ మాస్టర్ తలపెట్టి డాన్స్ స్టెప్పులు వేశారు. ఈ ముద్దులు, డాన్స్ లతో పాటు ఓంకార్ ను "బావా" అని పిలుస్తూ రెచ్చిపోయింది శ్రీముఖి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...