English | Telugu
సౌందర్యకు శౌర్య ఫొటో దొరికినట్టేనా?
Updated : May 6, 2022
బుల్లితెర పై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. గత కొంత కాలంగా విజయవంతంగా టాప్ రేటింగ్ తో సాగుతున్న ఈ సీరియల్ ఇటీవలే మరో కొత్త మలుపు తిరిగింది. డాక్టర్ బాబు, వంటలక్కల కొత్త తరంతో ఈ సీరియల్ ని నడిపిస్తున్నాడు దర్శకుడు. ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటోంది. ఇక ఈ రోజు 1344 వ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం. అమ్మా నాన్న కలిస్తే హిమని పెళ్లి చేసుకోవడం ఈజీ అవుతుందని ప్రేమ్ అనుకుంటాడు. ఆ వెంటనే హిమకు ఫోన్ చేసి రమ్మంటాడు ప్రేమ్.
కట్ చేస్తే.. సౌందర్య.. డాక్టర్ బాబు,దీపల ఫొటో ముందు నిలబడి సత్యం - స్వప్నల గురించి బాధపడుతూ వుంటుంది. ఆ తరువాత నిరుపమ్, ప్రేమ్, హిమ తింటుంటే జ్వాల వారికి వడ్డిస్తూ వుంటుంది. ఈ క్రమంలో మనం అంతా కలిసి కూర్చుని భోజనం చేస్తున్నట్టే మమ్మీ డాడీ కలిసి భోంచేయాలి అంటాడు ప్రేమ్. ఈలోపు సత్య వచ్చేసి జ్వాల అన్నంపెడుతోందిరా బంగారం అంటాడు. ఎక్కువైందా ఏంటీ బంగారం బంగారం అంటున్నావ్ అంటాడు ప్రేమ్.
కట్ చేస్తే చిత్తు కాగితాలు జ్వాల వెళుతుంది. అక్కడొకడు జ్వాల డబ్బులు కొట్టేస్తాడు. అది గమనించిన సౌందర్య డబ్బు లాక్కుని జ్వాలకు చెబుతుంది. వెంటనే వాడి చెంప పగలగొడుతుంది జ్వాల. ఆ తరువాత చిత్తు కాగితాల్లో హిమ - శౌర్య ఫొటోలు కనిపిస్తాయి. అవి సౌందర్య కంట పడ్డాయా? పడకుండా శౌర్య ఏం చేసింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.