English | Telugu

నయని పావనికి శివాజీ సపోర్ట్.. ఫెయిర్ గా ఆడమని సలహా!

నయని పావని గత సీజన్ లో బిగ్ బాస్ అన్యాయం చేసాడు. గత సీజన్ లోను వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి.. తన ఆట మొదలు కాకముందే అదే వారంలో ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. తన ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో బిగ్ బాస్ పై నెగెటివ్ కామెంట్లు కూడా వచ్చాయి.

అయితే నయని హౌస్ లో ఉన్న ఒక్క వారంలోనే అందరితో కలిసిపోయింది. ముఖ్యంగా శివాజీతో చాలా క్లోజ్ అయ్యింది. అతడిని చుస్తే ఒక డాడ్ ని చూసినట్లు ఉంటుందని చాల ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. అలాగే శివాజి కూడా తనకి ఇద్దరు కొడుకులే కావడంతో నయనిని కూతురులా ట్రీట్ చేస్తూ వస్తున్నాడు. ఈ బంధం కేవలం బిగ్ బాస్ హౌస్ కే పరిమితం కాలేదు.. హౌస్ నుండి బయటకు వచ్చాక శివాజీ ఇంటికి వచ్చిన వీడియోస్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుండేది నయని పావని. అలా బిగ్ బాస్ అనంతరం కూడా నయనికి శివాజీ సపోర్ట్ గా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నయని నాగార్జునతో తన హ్యాపీ నెస్ ని షేర్ చేసుకుంది. గత సీజన్ లో వచ్చినప్పుడు.. ఉన్నది వారమే కానీ ఆ వారంలో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాను.. వాళ్ళ నమ్మకం నిలబెడతానని నయని అంది.

ఆ తర్వాత నాగార్జున సర్ ప్రైజ్ వీడియో చూపించాడు. శివాజీ మాట్లాడిన వీడియోని చూపించాడు. అల్ ది బెస్ట్ నయని లాస్ట్ సీజన్ లో నీ ట్యాలెంట్ ప్రూవ్ చేసుకోలేదు.. ఇప్పుడు చేసుకునే టైమ్ వచ్చింది.. నువ్వు గేమ్ అనేది ఫైయిర్ గా ఆడు.. అప్పుడు గేమ్ గెలవడంతో పాటు ప్రేక్షకులను గెలుస్తావని శివాజి తనకి సలహా ఇవ్వగా.. థాంక్స్ డాడీ అని నయని అంది. బిగ్ బాస్ హౌస్ లో నాకు నాన్న దారికారు..‌లైఫ్ లో నాకు ఇది సెకెంఢ్ ఛాన్స్ అంటూ నయని అంది. ఇక వచ్చీ రాగానే ఆటలో కత్తి నబీల్.. సుత్తి మణికంఠ, సీత అంటూ చెప్పేసింది నయని. అప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వారానికే ఎలిమినేట్ అయిపోయా.. కానీ ఈసారి అసలు తగ్గేదేలే అంటూ కాన్ఫిడెన్స్‌గా చెప్పింది. ఇక నాగార్జున తనని హౌస్ లోకి పంపగా..లోపలికి వెళ్లి అందరితో సరదాగా మాట్లాడేసింది. ఇక హౌస్ లో నయని పావని ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తుందో చూడాలి మరి.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...