English | Telugu

రష్మీ డాన్స్ కోసమే జబర్దస్త్ చూస్తాను...


త్వరలో వినాయక చవితి పర్వదినం రాబోతోంది. ఈ నేపథ్యంలో వినాయక చవితి స్పెషల్ గా శనివారం నాడు జై జై గణేష్ పేరుతో ఒక ఈటీవీలో ఒక ఈవెంట్ రాబోతోంది. దీని న్యూ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఇంద్రజ, ఖుష్బూ ఇద్దరూ వచ్చారు. ఇక స్పెషల్ అప్పియరెన్స్ గా శివాజీ కూడా వచ్చాడు. రావడమే చీరా సారెతో ఆడపడుచులు ఇంద్రజ, ఖుష్బూకి ఇచ్చాడు. దాంతో రష్మీ అలక ప్రదర్శించింది. "మరి నాకు లేవా పట్టు బట్టలు" అని అడిగింది. "నువ్వు ముందు పెళ్లి చేసికో నీకు పట్టు చీరల షోరూమే కొనిస్తాను. అప్పటివరకు పొట్టి బట్టలే నీకు" అనేసరికి అందరూ నవ్వేశారు.

ఫైనల్ గా మురారి మూవీలోని "చెప్పమ్మా చెప్పమ్మా" సాంగ్ కి డాన్స్ చేసిన రష్మీ వీడియోని ప్లే చేసి చూపించారు. కానీ చాలా బాగా చేసింది రష్మీ అంటున్నారు నెటిజన్స్. ఇక ఇది చూసాక శివాజీ ఒక కామెంట్ చేసాడు. "నేను జబర్దస్త్ చూడడం స్టార్ట్ చేసింది రష్మీ డాన్స్ చూడడం కోసమే" అన్నాడు..రష్మీ సిగ్గుల మొగ్గయింది. ఇక ఈ కమెడియన్స్ అందరికీ రకరకాల ఈవెంట్స్ ఇచ్చి గేమ్స్ ఆడించింది రష్మీ. అలాగే పియానో కూడా వాయించారు. అలాగే ఇంద్రజ, ఖుష్భు కలిసి డాన్స్ కూడా చేశారు. మేడం అంటే మేడం అంతే అంటూ శివాజీ కామెంట్ చేసాడు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...