English | Telugu

ష‌న్ను - దీప్తి బ్రేక‌ప్‌పై సిరి షాకింగ్ కామెంట్స్‌

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 5 ముగిసి దాదాపు నెల రోజుల కావ‌స్తోంది. అయినా దీని ప్ర‌కంపన‌లు ఇంకా వినిపిస్తూనే వున్నాయి. వీజే స‌న్నీ ఈ సీజ‌న్ విజేత‌గా నిలిస్తే, ర‌న్న‌ర‌ప్ గా ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్ నిలిచారు. ఇదిలా వుంటే ఈ సీజ‌న్ లో ష‌న్ను - సిరిలు చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు.. హ‌గ్గులు, కిస్సుల‌తో వెగ‌టు పుట్టించే వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేశారు. వీక్ష‌కుల‌తో పాటు వారి పేరెంట్స్ కు కూడా వీరి చేష్ట‌లు చిరాకు తెప్పించాయి. దీంతో వీరి ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది.

Also read:దీప్తి-ష‌న్ను రిలేష‌న్‌షిప్‌పై గుడ్ న్యూస్ చెప్పిన ష‌ణ్ముఖ్ ఫాద‌ర్‌!

సీజ‌న్ ముగిసిన త‌రువాత కూడా ష‌న్ను, సిరిల పై నెట్టింట జ‌రిగిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. దీంతో వీరి ల‌వ్ లైఫ్ కి డేంజ‌ర్ బెల్స్ మోగాయి. ప్ర‌ధానంగా సిరి వ‌ల్ల ష‌న్ను ల‌వ్ లైఫ్ డేంజ‌ర్ లో ప‌డింది. త‌న కార‌ణంగా ష‌న్నుకు దీప్తి బ్రేక‌ప్ చెప్పాల్సి వ‌చ్చింది. సిరిని టార్గెట్ చేసిన నెటిజ‌న్స్ ఆమెని ఆడుకోవ‌డం మొద‌లుపెట్టారు. దీంతో చాలా వ‌రకు డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయింది సిరి. త‌న వ‌ల్ల ష‌న్ను - దీప్తి విడిపోయారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని త‌ట్టుకోలేక సిరి సైలెంట్ అయిపోయింది.

Also read:​బ్రేకప్ తర్వాత ఊహించని సర్ప్రైజ్.. దీప్తితో కలిసున్న ఫోటో షేర్ చేసిన షణ్ముఖ్!

శ్రీ‌హాన్ కూడా సిరితో అటాచ్‌మెంట్ ని త‌గ్గించుకోవ‌డంతో సిరి మ‌రింత‌గా బాధ‌ప‌డ‌టం మొద‌లుపెట్టిందని ప్ర‌చారం మొద‌లైంది. అయితే సంక్రాంతి సంద‌ర్భంగా సిరి వైజాగ్ వెళ్లింది. అక్క‌డ సెల‌బ్రేష‌న్స్ లో పాల్గొంది. ఈ సంద‌ర్బంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించి షాకిచ్చింది. "హౌస్ నుంచి వ‌చ్చాక నాపై ట్రోలింగ్ జ‌రిగింది. అది చూసి డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయాను. ఆ త‌రువాత సెట్ట‌య్యాను. దీప్తి బ్రేక‌ప్ స్టేట‌స్ పెట్ట‌గానే మ‌ళ్లీ నాపై ట్రోలింగ్ మొద‌లైంది. బ్రేక‌ప్ చెప్పుకునేంత వీక్ ల‌వ్ వారిదని నేను అనుకోవ‌డం లేదు. అంతే కాకుండా 100 రోజుల జ‌ర్నీ కార‌ణంగా బ్రేక‌ప్ అయ్యిందంటే.. అది బిగ్ బాస్ వ‌ల్లే అయింద‌ని అస్స‌లు అనుకోను" అని చెప్పుకొచ్చింది సిరి.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...