English | Telugu

టూర్ లో శ్రీ‌హాన్‌.. హోమ్ ఐసోలేష‌న్‌లో సిరి..

బిగ్‌బాస్ సీజ‌న్ 5 కార‌ణంగా రెండు ప్రేమ జంట‌ల్లో క‌ల‌క‌లం మొద‌లైంది. ఈ షో పుణ్య‌మా అని న‌లుగురు ప్రేమికులు విర‌హ వేద‌న‌ని అనుభ‌విస్తున్నారు. ఈ షో కార‌ణంగా ష‌న్ను - దీప్తి సున‌య‌న మ‌ధ్య దూరం పెరిగింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా దీప్తి - ష‌న్నుకు బ్రేక‌ప్ చెప్పేసింది కూడా. ఇప్పుడు వీరిద్ద‌రు క‌లుస్తారా? .. లేదా అని వీరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ జంట బ్రేక‌ప్ ప్ర‌భావం మ‌రో జంట పై ప‌డింది. అదే శ్రీ‌హాన్ - సిరి.

Also Read: ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య మ‌ధ్య‌ ల‌వ్ స్టోరీ ఎలా మొద‌లైందో తెలుసా?

గ‌త కొన్ని రోజులుగా వీరిద్ద మ‌ధ్య కూడా దూరం పెరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక శ్రీ‌హాన్ -సిరి క‌లుసుకున్న సంద‌ర్భాలు లేవు. సోష‌ల్ మీడియా వేదిక‌గా క‌లిసి ఫొటోల‌ని పంచుకున్నదీ లేదు. సిరి బ‌ర్త్ డే సంద‌ర్భంగా శ్రీ‌హాన్ విష్ చేస్తూ పోస్ట్ పెడితే దానికి సిరి నుండి ఎలాంటి రిప్లై రాక‌పోవ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య దూరం మొద‌లైంద‌ని అర్థ‌మైంది. దీంతో శ్రీ‌హాన్ - సిరి కూడా విడిపోతున్నారంటూ ప్ర‌చారం మొద‌లైంది.

Also Read: ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య ఎందుకు విడిపోయారు?

ఇదిలా వుంటే తాజాగా సిరి వైర‌స్ బారిన ప‌డింది. గ‌త కొన్ని రోజులుగా ఇంటి ప‌ట్టునే వుంటూ చికిత్స తీసుకుంటోంది. బిగ్‌బాస్ కార‌ణంగా సిరికి దూరంగా వుంటున్న శ్రీ‌హాన్ ఇప్పుడు ఒంట‌రిగా నార్త్ టూర్ కి వెళ్ల‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సిరి ఇలా వుంటే శ్రీ‌హాన్ నార్త్ టూర్ కి వెళ్ల‌డం ఏంట‌ని అంతా అంటున్నారు. సిరి కార‌ణంగా హ‌ర్ట్ అయిన శ్రీ‌హాన్ త‌న‌ని దూరం పెడుతున్నాడ‌ని, త‌న‌కు కోవిడ్ అని తెలిసినా త‌ను నార్త్ టూర్ కి వెళ్ల‌డం వారిద్ద‌రి మ‌ధ్య పెరుగుతున్న దూరాన్ని తెలియ‌జేస్తోంద‌ని నెటిజ‌న్ లు కామెంట్ చేస్తున్నారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...