English | Telugu
బిగ్ బాస్ సిరిపై శ్రీహాన్ షాకింగ్ కామెంట్స్
Updated : May 14, 2022
బిగ్‌బాస్ గత సీజన్‌లో సిరి హన్మంత్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. షణ్ముఖ్‌తో కలిసి మోజో రూమ్, బాత్రూమ్ వద్ద వీళ్లు చేసిన హంగామా వీరిని సోషల్ మీడియాలో విలన్లుగా మార్చింది. అంతే కాకుండా బిగ్ బాస్ అన్ని సీజన్లతో పోలిస్తే వరస్ట్ జోడీగా వీరిని నెటిజన్లు నెట్టింట ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. హగ్గులు, అందరిని పక్కన పెట్టి క్లోజ్‌గా వుండటం, సన్నీని టార్గెట్ చేయడం వంటి కారణాల వల్ల చాలా వరకు తమ పాపులారిటీని పోగొట్టుకున్న ఈ జంట చివరికి నెటిజన్ల దృష్టిలో విలన్లుగా మారింది. దీని కారణంగా షణ్ముఖ్ - దీప్తి సునయన, సిరి హన్మంత్ - శ్రీహాన్ మధ్య దూరం పెరిగిందంటూ వార్తలు వినిపించాయి.
షణ్ముఖ్ - సునయన మాత్రం ఏకంగా బ్రేకప్ చెప్పుకోవడం పలువురిని షాక్‌కు గురిచేసింది. వీళ్ల లాగే విడిపోయారనుకున్న సిరి - శ్రీహాన్ బిగ్ బాస్ సీజన్ తరువాత కలిసి పార్టీలు చేసుకుంటూ రూమర్లకు చెక్ పెట్టారు. సిరి బర్త్ డేకి తనకు ప్రత్యేకంగా విషేస్ తెలియజేసిన శ్రీహాన్ తమ మధ్య ఎలాంటి అపోహలు, అపార్థాలు లేవంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక తాజాగా సిరి గురించి ఎవరికీ తెలియని విషయాలు చెప్పి ఆమె ఎమోషనల్ అయ్యేలా చేశాడు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లతో యాంకర్ రవి సరదాగా ఓ వీడియో చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది.
ఇందులో సిరి గురించి శ్రీహాన్ ఓ వీడియో సందేశాన్ని పంపించాడు. సిరి గొప్పతనం, తను ఎవరి అండ లేకుండా ఎదిగిన తీరుని వివరించి సిరి ఎమోషనల్ అయ్యేలా చేశాడు. 'సిరిని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. నాకిప్పటికీ పడుతూనే వుంది'. అంటూ చెప్పుకొచ్చాడు. 'సిరి ఏదైనా సాధించాలంటే ఎలాంటి కష్టాలు వచ్చినా దేన్నీ పట్టించుకోదు. తను వైజాగ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి కొన్ని సాధించాలనుకుంది. యాంకరింగ్ చేసుకుంటూ సీరియల్స్, సినిమాలు చేసింది. మొన్నటి బిగ్ బాస్ వరకు మొత్తం తన కష్టమే. ఎవరూ సాయం చేసింది లేదు' అని శ్రీహాన్ అనడంతో సిరి ఒక్కసారిగా ఎమోషనల్ అయింది.