English | Telugu

భర్త అరెస్ట్... టీవీ షూటింగ్‌కు శిల్పాశెట్టి గైర్హాజరు

ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ హీరోయిన్ శిలాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ ఓ టీవీ షో షూటింగ్ మీద కూడా ప్రభావం చూపింది. అప్పటికప్పుడు డాన్స్ రియాలిటీ షో నిర్వాహకులు శిల్పాశెట్టికి బదులు, ఆమె స్థానంలో ఎవర్ని కూర్చోబెట్టాలా? ఇప్పటికిప్పుడు ఎవరు వస్తారు? అని వెతుక్కోవాల్సి వచ్చింది. అసలు, వివరాల్లోకి వెళితే...

డాన్స్ రియాలిటీ షో 'సూపర్ డాన్స్ చాప్టర్ 4'లో శిల్పాశెట్టి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం షో షూటింగ్ ప్లాన్ చేశారు. అయితే, సోమవారం రాత్రి భర్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయడంతో శిల్పాశెట్టి ఇంటి నుండి బయటకు అడుగుపెట్టలేదు. ఆమె పరిస్థితి అందరూ అర్థం చేసుకోదగినదే. ఏ మహిళ అయినా సరే భర్తను అరెస్ట్ చేస్తే ఆనందంగా సెట్స్ కు వచ్చి షూటింగ్ ఎలా చేస్తారు. పైగా, అరెస్ట్ చేసినది పోర్నోగ్రఫీకి సంబంధించిన కేసులో. దాంతో షూటింగ్ కు రాలేనని శిల్పాశెట్టి చెప్పారట. గైర్హాజరు అయ్యారు.

శిల్పాశెట్టి స్థానంలో మరో సీనియర్ హీరోయిన్ కరీష్మా కపూర్ ను గెస్ట్ జడ్జ్ గా తీసుకొచ్చి షూటింగ్ కంప్లీట్ చేశారు 'సూపర్ డాన్స్ చాప్టర్ 4' నిర్వాహకులు. ఇంకా ఎన్ని రోజులు షూటింగ్ కు శిల్పాశెట్టి అందుబాటులో ఉండరు? కరీష్మా కపూర్ తో ఎన్ని ఎపిసోడ్స్ చేస్తారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...