English | Telugu

Shekhar basha elimination: ఆ ముగ్గురు ఫేక్.. రియల్ ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్ 8 లో సెకెంఢ్ వీక్ ముగిసింది. హౌస్ నుండి మొదటి కంటెస్టెంట్ గా బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వగా, రెండో ఎలిమినేషన్ గా శేఖర్ బాషా నిన్న బయటికి వచ్చాడు.

నిజానికి ఈ వారం ఓటింగ్ పరంగా చూసుకుంటే శేఖర్ చాలా క్లియర్‌గా సేఫ్‌లో ఉన్నాడు. కానీ బిడ్డ పుట్టిన ఆనందంలో, వాడిని చూడాలనే ఆత్రుతతో బిగ్‌బాస్ హౌస్ నుంచి తనకి తానుగా శేఖర్ బాషా బయటికి వచ్చేశాడనే చెప్పాలి. కానీ అలా చెప్తే బాగోదు కనుక నాగార్జున ఈ ఎలిమినేషన్‌కి బిగ్ ట్విస్ట్ అంటూ చెప్పాడు. ఇక నామినేషన్ లో ఒక్కొక్కరిని సేవ్ చేయగా.. చివరికి ఆదిత్య ఓం, శేఖర్ బాషా ఉన్నారు. బాటమ్ 2లో ఆడియన్స్ సెలక్ట్ చేసిన వాళ్లే ఉన్నారు.. కానీ ఈ సీజన్‌లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే.. ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్న ఆ ఇద్దరిలో ఇంట్లో ఎవరుంటారు.. ఇంటి బయటికి ఎవరొస్తారనేది ఈసారి హౌస్‌మెట్స్ డిసైడ్ చేయబోతున్నారంటు నాగార్జున అన్నాడు. ఆ తర్వాత వీళ్లలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదనేది హౌస్‌మెట్స్ రీజన్ చెప్పి డిసైడ్ చేయాలంటూ నాగ్ అన్నారు. ఇక దీనికి ఆడియన్స్ తప్పుపట్టకూడదని హౌస్ బయట విషయాలు కాదు.. లోపల విషయాలను పరిగణించే రీజన్ చెప్పాలంటూ ఇండైరెక్ట్‌గా శేఖర్ భార్య డెలివరీ గురించి నాగ్ హింట్ ఇచ్చాడు.

ఇక హౌస్ లోని పన్నెండు మందిలో ఒక్క సీత మినహా అందరు ఆదిత్య ఓం కి పూలదండ వేసి అతనిలో గెలవాలనే ఫైర్ ఉందని, ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడని చెప్పారు. ఇక శేఖర్ బాషా ఇక్కడ లేడని, యాక్టివ్ గా ఉండటం లేదని అందరు అదే రీజన్ చెప్పారు. ఆ తర్వాత శేఖర్ బాషా ఎలిమినేషన్ అయి నాగార్జున దగ్గరకి వచ్చాడు. దాంతో కిర్రాక్ సీత బాగా ఏడ్చేసింది. ఇక హౌస్ లో ఎవరు ఫేక్? ఎవరు రియల్ గా ఉన్నారో చెప్పమని నాగార్జున అడుగగా‌‌.. సీత, విష్ణుప్రియ, ప్రేరణ రియల్ అని వారు ఇన్నోసెంట్ అని రియల్ క్యారెక్టర్ అని శేఖర్ బాషా చెప్పాడు. ఇక సోనియా, మణికంఠ ఫేక్ అని చెప్పాడు. ఆఅ తర్వాత తన దోస్త్ ఆదిత్య బొమ్మ పెడుతూ ఆయన నన్ను మూడు సార్లు నామినేట్ చేశాడు.. తిరిగి నేను ఒక్కసారి నామినేట్ చేస్తేనే ఫేస్ మారిపోయింది.. సూటిపోటి మాటలు మాట్లాడినట్లు అనిపించింది. నేను తీసుకున్నంత స్పోర్టివ్‌గా ఆయన తీసుకోలేదంటూ శేఖర్ అన్నాడు. ఇలా మొత్తానికి వెళ్తూ వెళ్తూ అందరికి తెలిసిన సోనియా బిహేవియర్‌ను మరోసారి ఆడియన్స్‌కి గుర్తుచేసి వెళ్లిపోయాడు శేఖర్.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...