English | Telugu

దీప్తి-ష‌న్ను రిలేష‌న్‌షిప్‌పై గుడ్ న్యూస్ చెప్పిన ష‌ణ్ముఖ్ ఫాద‌ర్‌!

బిగ్‌ బాస్ సీజ‌న్ 5 ముగిసింది కానీ దాని వ‌ల్ల కొంత మంది జీవితాల్లో ఏర్ప‌డిన క‌ల‌త‌లు ఇంకా తీర‌డం లేదు. మ‌రీ ప్ర‌ధానంగా ఈ షో వ‌ల్ల పొందిన దానికంటే న‌ష్ట‌పోయింది షన్ను, దీప్తి. దీప్తికి నేరుగా షోతో సంబంధం లేకపోయినా ష‌న్ను కార‌ణంగా వార్త‌ల్లో నిలిచింది. ఈ ఇద్ద‌రూ గ‌త ఐదేళ్లుగా ప్రేమ‌లో మునిగితేలారు. అయితే ఇటీవ‌ల బిగ్‌బాస్ షో కార‌ణంగా వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింది. అది చివ‌రికి బ్రేక‌ప్ చెప్పుకునేంత వ‌ర‌కు వెళ్లింది.

Also read:ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌కు మ‌ళ్లీ షాక్‌.. త‌గ్గేదేలే అంటున్న దీప్తి!

దీనిపై ఇద్ద‌రూ సోష‌ల్‌ మీడియా వేదిక‌గా త‌మ బాధ‌ని వెలిబుచ్చిన విష‌యం తెలిసిందే. ష‌ణ్ముఖ్, దీప్తి సున‌య‌న మ‌ళ్లీ క‌లుస్తారా?.. క‌లిసే ఛాన్స్ వుందా? అంటే ష‌ణ్ముఖ్ ఫాద‌ర్ వుందంటూ గుడ్ న్యూస్ చెప్పారు. వాళ్లు క‌లుస్తార‌ని, అభిమానులు కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు ష‌ణ్ముఖ్ తండ్రి. "వాళ్లిద్ద‌రూ క‌లిసే వుంటారు. బ్రేక‌ప్ దీప్తి చెప్పింది కానీ ష‌ణ్ముఖ్ చెప్ప‌లేదుగా.. వ్య‌క్తిగ‌త విష‌యాలు మ‌నం మాట్లాడ‌కూడ‌దు. ఆ అమ్మాయికి ఏమ‌నిపించిందో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాళ్లు క‌ల‌వ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుందేమో కానీ వాళ్లు క‌లిసే వుంటారు. ఇది రెండు కుటుంబాల‌కు సంబంధించిన విష‌యం. అంతా శుభ‌మే జ‌రుగుతుంది. ఈ విష‌యంలో అభిమానులు అనుమానించాల్సిన అవ‌స‌ర‌మే లేదు" అని చెప్పుకొచ్చారు ష‌ణ్ముఖ్ ఫాద‌ర్‌. దీంతో ష‌న్ను, దీప్తి అభిమానులు హ‌ర్షాతిరేకాల‌ని వ్య‌క్తం చేస్తున్నారు.

Also read:​బ్రేకప్ తర్వాత ఊహించని సర్ప్రైజ్.. దీప్తితో కలిసున్న ఫోటో షేర్ చేసిన షణ్ముఖ్!

అయితే ష‌న్ను ప్ర‌వ‌ర్త‌న‌తో దీప్తి మ‌న‌సు విరిగిపోయింద‌నీ, అందుకే బ్రేక‌ప్ చెప్పింద‌నీ చాలామంది న‌మ్ముతున్నారు. మ‌రి త‌ను ష‌న్నును ఎలా క్ష‌మించి మ‌ళ్లీ అత‌నికి చేరువవుతుంది? అని ప్ర‌శ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు. మ‌రి ష‌న్ను వాళ్ల నాన్న చెప్పిన‌ట్లు ఈ ఎక్స్ ల‌వ‌ర్స్ మ‌ళ్లీ క‌లుస్తారా? లెట‌జ్ వెయిట్ అండ్ సీ.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...