English | Telugu
'కామెడీ స్టార్స్ ధమాకా'లో బండ్ల గణేష్ పై పంచ్ లే పంచ్ లు
Updated : May 29, 2022
జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలకు ధీటుగా మెగా బ్రదర్ నాగబాబు స్టార్ మాలో ప్రారంభించిన కామెడీ షో `కామెడీ స్టార్స్ ధమాకా`. గత కొంత కాలంగా హాస్య ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ కమెడియన్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. మెగా బ్రదర్ నాగాబాబు, శేఖర్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ కామెడీ షోలో హరి, ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, టిల్లు వేణు, అభి, యాదమ్మరాజు టీమ్ లీడర్ లుగా, దీపిక పిల్లి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
గత కొన్ని నెలలుగా హాస్య ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ నవ్వులు పూయిస్తోంది. తాజాగా ఈ షోకి బండ్ల గణేష్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. తాజా ఎపిసోడ్ లో బండ్ల గణేష్ అభిమానిని అంటూ హరి చేసిన స్కిట్ నవ్వులు పూయిస్తోంది. బండ్ల గణేష్ ని పొగిడేస్తూనే అతనిపై హరి వేసిన పంచ్ లు ఆకట్టుకుంటున్నాయి. `పెళ్లైన మగాడి జీవితం బండ్ల గణేష్ గారు మీడియాకిచ్చే ఇంటర్వ్యూ లాంటిది.. ఎంత ప్రశాంతంగా ఇంటర్వ్యూ ఇద్దామనుకున్నా ఎక్కడో ఒకచోట ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటది అనేశాడు హరి. ఇంతలో ఓ కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చి ఈయనెవరు అంటే బండ్ల గణేష్ అన్నాడు హరి. అంతే కాకుండా ఆయన సినిమా తీస్తే కలెక్షన్ లు వస్తాయి. ఇంటర్వ్యూలిస్తే కాంట్రవర్సీలు వస్తాయంటూ పంచ్ వేశాడు.
ఆ తరువాత బండ్లపై మరో పంచ్ పేల్చాడు. నేను బేసిగ్గా బండ్ల గణేష్ అభిమానిని, మాకు న్యాయమైనా సాయమైనా వెంటనే చేసేస్తాం అన్నాడు. ఆ తరువాత లక్ష రూపాయల అప్పు స్కిట్ తో మరో పంచ్ వేశాడు హరి. స్కిట్ లో ఓ వ్యక్తి వద్ద లక్ష రూపాయలు అప్పుతీసుకున్న హరి అది మర్చిపోయినట్టు నటిస్తూ వారిని నానా ఇబ్బందికి గురిచేస్తుంటాడు. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి నానా రకాలుగా గుర్తు చేస్తుంటాడు కానీ హరి మాత్రం గుర్తు లేనట్టుగా ఎక్స్ ప్రెషన్ పెట్టడంతో `వాడు బండ్ల గణేష్ అభిమాని అప్పు విషయం ఏనాడో మర్చిపోయాడు` అంటూ నాగబాబు పంచ్ వేయడంతో అక్కడున్న వారంతా నవ్వేశారు.