English | Telugu

సరేగమప ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ త్వరలో


జీ తెలుగు ఇప్పుడొక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేసింది. సరేగమప ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ పేరుతో సరికొత్త షో త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. హోస్ట్ గా శ్రీముఖి వచ్చింది. ఇక దుమ్ము బాబోయ్ దుమ్ము అంటున్నారు నెటిజన్స్. అలాగే జడ్జెస్ గా అందరికీ ఇష్టమైన కోటి, ఎస్పి. శైలజ, కాసర్ల శ్యామ్ వచ్చారు. ఈ సీజన్ జీ సరేగమప సరదాగా ఉండబోతోంది అని శైలజ అంటే ఈ సారి సీజన్ తీన్ మారే అంటూ శ్యామ్ అన్నారు. ఇక మెంటార్స్ గా సింగర్స్ రేవంత్, రమ్య బెహరా కనిపించారు. అలాగే సింగర్ చిన్మయి, విజయ్ ఏసుదాస్ వంటి వాళ్ళు కూడా ఎంట్రీ ఇచ్చారు.

జీ తెలుగు ఇప్పుడు సరేగమప సరి కొత్త సీజన్లో ని త్వరలో గ్రాండ్ గా లాంచ్ చేయబోతోంది. దానితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ప్రతిభావంతులైన సింగర్స్ ని ఈ షోలోకి తీసుకురాబోతోంది. ఈ సీజన్ కోసం ఆగష్టు ఎండింగ్ వరకు ఆడిషన్స్ కూడా నిర్వహించింది. జీ తెలుగు కూడా మిగతా ఛానెల్స్ కి తక్కువ కాదన్నట్టు ఎన్నో షోస్ ని అందిస్తోంది. సీరియల్స్, కామెడీ షోస్ అలాగే రియాలిటీ షోస్ అన్నీ ఆడియన్స్ ముందుకు తీసుకువస్తోంది. ఇక ఇప్పుడు సరేగమప కొత్త సీజన్ తో రాబోతోంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...