English | Telugu

నువ్వు అద్భుత‌మైన అమ్మాయివి.. నేనెంతో అదృష్ట‌వంతుడిని!

బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సినీ న‌టుడు సామ్రాట్ రెడ్డి ఫైనల్స్ వరకు చేరుకున్నారు. అయితే ట్రోఫీ మాత్రం అందుకోలేకపోయారు. హౌస్‌లో తన ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకున్నారు. మంచి ఇమేజ్‌తో హౌస్ నుండి బయటకొచ్చారు. మొదటి భార్యతో విడాకుల వ్యవహారం సామ్రాట్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసినప్పటికీ.. బిగ్ బాస్ షో అతడికి మంచి పేరు తీసుకొచ్చింది.

గతేడాది సామ్రాట్ రెండో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తాజాగా తన శ్రీమతి అంజ‌నా శ్రీ‌లిఖిత‌ పుట్టినరోజు సందర్భంగా ఆమెకి స్పెషల్ విషెస్ చెప్పారు సామ్రాట్. ఈ క్రమంలో ఆయన షేర్ చేసిన రొమాంటిక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. "నువ్వు ఎంతో స్వీట్.. నా హృదయానికి దగ్గరయ్యావ్.. నిన్ను ప్రతీరోజు ప్రేమిస్తూ ఇలా గడిపే క్షణాలు లభిస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. నువ్ అద్భుతమైన అమ్మాయివి.. నేను ఎంతో అదృష్టవంతుడిని. హ్యాపీ బర్త్ డే స్వీట్ హార్ట్" అంటూ రాసుకొచ్చారు.

అలానే మరో పోస్ట్ పెడుతూ.. తన భార్య మీద ఉన్న పేమని తెలియబరిచాడు. ''నీకు చెప్పడానికి ఇంకేం పదాలు లేవు. ఐ లవ్యూ.. హ్యాపీ బర్త్ డే" అంటూ విష్ చేశారు. ఈ పోస్ట్ లు చూసిన టీవీ సెలబ్రిటీలు, నెటిజన్లు అంజ‌నా శ్రీ‌లిఖిత‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. కొన్ని సినిమాల్లో న‌టించిన సామ్రాట్ 'పంచాక్ష‌రి' మూవీలో అనుష్క జోడీగా న‌టించి వార్త‌ల్లో నిలిచాడు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...