English | Telugu

శ్రీముఖీ... ఇంతున్నావ్, నువ్ తగ్గు ముందు!

కామెడీలో బాడీ షేమింగ్ కూడా ఓ భాగమైంది. ముఖ్యంగా టీవీ షోల్లో కామెడీ కోసం ఎదుటివ్యక్తి బాడీని విమర్శించడం పరిపాటిగా మారింది. రీసెంట్‌గా 'జబర్దస్త్'లో వర్ష బ్లౌజ్ మీద ఇమ్మాన్యుయేల్ పంచ్ వేశాడు. ఇక, 'హైపర్' ఆది స్కిట్స్‌లో బాడీ షేమింగ్‌ను జనాలు పట్టించుకోవడం మానేసి నవ్వడం మొదలు పెట్టారని అనుకోవాలేమో. ఇప్పుడు టీవీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సద్దాం వంతు వచ్చింది. శ్రీముఖి బరువును ఉద్దేశిస్తూ అతడు పంచ్ వేశాడు.

'స్టార్ మా' ఛానల్‌లో సీరియల్ ఆర్టిస్టులు అందరిచేత ఒక ప్రోగ్రామ్ చేశారు. అదే 'స్టార్ మా పరివార్ ఛాంపియన్షిప్'. ప్రేక్షకులు మెచ్చిన బుల్లితెర ఆర్టిస్టులు అందరూ ఒక్కచోట సందడి చేయనున్నారు. ఆ షో సండే ఆరు గంటలకు టెలికాస్ట్ కానుంది. ప్రేక్షకులకు ఎంజాయిమెంట్ మామూలుగా ఉండదని చెప్పే క్రమంలో 'తగ్గేదే లే' అని శ్రీముఖి చెప్పింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా 'ఇంత ఉన్నావ్. నువ్ తగ్గు ఫస్టు' అని సద్దాం పంచ్ వేశాడు. టీవీ షోల్లో ఇవన్నీ కామన్ కాబట్టి శ్రీముఖి లైట్ తీసుకున్నట్టు ఉంది.

రీసెంట్ గా రిలీజైన ప్రోమోలో హైలైట్ ఏంటంటే... 'డాక్టర్ బాబు మీరు తగ్గాలి. పెళ్లిళ్ల విషయంలో తగ్గాలి' అని శ్రీముఖి చెప్పింది. 'కార్తీక దీపం' సీరియల్ లో సంగతులను గుర్తు చేస్తూ! అందుకు 'తగ్గేదే లే' అని నిరుపమ్ పరిటాల జవాబు ఇచ్చాడు. 'తెలుసు తెలుసు... ఎన్ని అయినా తగ్గవ్' అని మరో ఆర్టిస్ట్ అనడం కొసమెరుపు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...