English | Telugu

రుద్రాణి వంటింట్లో దీప.. ఏం జ‌రుగుతోంది?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక‌ దీపం`. గ‌త కొన్ని వారాలుగా ట్విస్ట్ ల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ తాజాగా మ‌రో ట్విస్ట్ కు తెర‌లేపింది. సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల కార్‌ని ఫాలో అవుతూ మోనిత తాటికొండ గ్రామంలోకి ఎంట్రీ ఇస్తుంది. అక్క‌డ వారు ఆశ్ర‌మంలో చేర‌డాన్ని గ‌మ‌నించి ఇదే గ్రామంలో త‌న ప‌నిమ‌నిషి ప్రియ‌మ‌ణిని వెత‌క‌డం మొద‌లుపెడుతుంది. ఇదే క్ర‌మంలో కార్తీక్ ప‌ని చేస్తున్న హోట‌ల్ లోకి వెళుతుంది. ఈ గురువారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార‌బోతోంది.

ఈ గురువారం 1248వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం. హోట‌ల్ లోప‌లికి వ‌చ్చిన మోనిత‌ని చూసి కార్తీక్ షాక్ కు గురై దాక్కంటే మ‌రో స‌ర్వెంట్ అన్నిగాడు.. మోనిత సినిమా హీరోయిన్ లా వుంద‌ని తానే వెళ‌తాన‌ని త‌న ద‌గ్గ‌రికి వెళతాడు. మోనిత‌ని ప్ర‌శ్న‌ల‌తో వేధించ‌డం మొద‌లుపెడ‌తాడు. విసుక్కుంటూనే అప్పిగాడికి స‌మాధానాలు చెబుతుంది మోనిత‌. 'మీరు సినిమా యాక్ట‌రా?' అని అడిగితే 'నేను డాక్ట‌ర్ ని' అని చెబుతుంది. 'అయితే మీ భ‌ర్త కూడా డాక్ట‌రే' అంటాడు అప్ప‌గాడు. దీంతో మోనిత సంబ‌ర‌ప‌డిపోతుంది.

Also Read: నాగిన్ డ్యాన్స్‌..కాజ‌ల్‌, యానీ ఇంత షాకిచ్చారేంటీ?

క‌ట్ చేస్తే ... రుద్రాణి వంటింట్లో దీప ఎంట్రీ... `ఏంటీ రుద్రాణి గారు అంతా కుశ‌ల‌మా..? ఏం లేదు ఇంట్లో గ్యాస్ అయిపోయింది. వంట చేసుకుందాం అని కూర‌గాయ‌లు బియ్యం తెచ్చుకున్నాను. నేను వంట చాలా త్వ‌ర‌గా చేస్తాను` అంటుంది దీప న‌వ్వుతూ.. 'నువ్వేంటీ దీపా ఇక్క‌డా.. అయినా గ్యాస్ అయిపోతే నా ఇంట్లో నా కిచెన్ నువ్వు ఎలా వాడ‌తావ్‌' అని రుద్రాణి అరుస్తుంది. 'క‌రెక్ట్ పాయింట్ లోకి వ‌చ్చావ్‌.. నేనే వ‌స్తే మీకు ఇంత కోపం వ‌చ్చింది.. మ‌రి నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న పిల్ల‌ల జోలికి వ‌స్తే నాకు ఎంత కోపం రావాలి?' అంటూ దీప న‌వ్వుతూనే రుద్రాణికి షాకిస్తుంది.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...