English | Telugu
Jayam serial : గంగ రిసెప్షన్ కి లక్ష్మీ వస్తుందా.. బ్యూటిషియన్ ఏం చేయనుంది!
Updated : Nov 28, 2025
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -126 లో....పెద్దసారు బయటకు వెళ్తాడు. అటుగా వెళ్తున్న లక్ష్మి, పెద్దసారుని చూసి తన దగ్గరికి వస్తుంది. ఎవరికి చెప్పకుండా రుద్ర బాబు గంగని పెళ్లి చేసుకున్నాడని మీరు కోపంగా ఉన్నారా అని అడుగుతుంది. అదేం లేదు రేపు గంగ, రుద్రకి రిసెప్షన్ చేస్తున్నాం.. మీరు తప్పకుండా రండి అని చెప్తాడు. మరొకవైపు గంగ రిసెప్షన్ అన్న సంగతి మర్చిపోయి మంచిగా పడుకుంటుంది. అప్పుడే ప్రీతి, స్నేహ, ప్రమీల వచ్చి నిద్ర లేపుతారు.
ఈ రోజు నీ రిసెప్షన్ మర్చిపోయావా అని అంటారు. అప్పుడే శకుంతల వస్తుంటే.. గమనించి ఇంకా గంగ రెడి అవలేదని తిడుతుందని తనకి గంగ కనిపించకుండా కవర్ చేస్తారు. ఆ గంగ వల్ల ఇంటి పరువు పోకూడదు మంచిగా రెడీ చేసి తీసుకొని రండి అని శకుంతల కోపంగా చెప్పి వెళ్తుంది. దాంతో స్నేహ బ్యూటీషియన్ ని రప్పిస్తుంది. మరొకవైపు రుద్ర రెడీ అవుతుంటే ఇషిక, వీరు వస్తారు. సారీ బావ నువ్వు గంగని పెళ్లి చేసుకుంటే ఆపొజిట్ చేసానని ఏదో ప్లాన్ ప్రకారం మాట్లాడతాడు. ఆ టాపిక్ వద్దని రుద్ర చిరాకుపడుతాడు. మరోవైపు లక్ష్మీ రిసెప్షన్ కి వెళ్లడానికి రెడీ అవుతుంది. అప్పుడే పైడిరాజు వస్తాడు. తనని చూసి. సారీ అండి నేను వేరే వాళ్ళ ఇంటికి వచ్చానని అంటాడు. నేనే అని లక్ష్మీ అంటుంది. రుద్ర, గంగలకి రిసెప్షన్ చేస్తున్నారట మనం ఖచ్చితంగా వెళదామని రిక్వెస్ట్ చేస్తుంది.
మరొకవైపు గంగని రెడీ చెయ్యడానికి ఏ చీర సెట్ అవ్వదు. ఆ తర్వాత బ్యూటిషియన్ ఇషిక దగ్గరికి వచ్చి పెళ్లి కూతురు ఎక్కడ అని అడుగుగా.. అక్కడా ఉందని ఇషిక చెప్తుంది. తను గంగ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత అందరు గెస్ట్ లు వచ్చారు. ఇంకా గంగ, రుద్ర రాలేదని పెద్దసారు అంటాడు. అప్పుడే రుద్ర, గంగ ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.