English | Telugu

రెచ్చిపోయిన మ‌నో..చేతులెత్తి దండం పెట్టిన రోజా



బుల్లితెర కామెడీ షో `ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌`. గ‌త కొంత కాలంగా కామెడీ స్కిట్ ల‌తో హాస్య ప్రియుల్ని ఆక‌ట్టుకుంటున్న ఈ షో నుంచి నాగ‌బాబు వెళ్లిపోయాక ఆ స్థానంలో సింగ‌ర్ మ‌నో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. రోజా తో క‌లిసి ఆయ‌న ఈ షోకు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కంటెస్టెంట్ ల‌పై సెటైర్లు వేస్తూ రోజాతో క‌లిసి మ‌నో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఈ ఇద్ద‌రు పోటా పోటీగా సెటైర్లు వేస్తూ న‌వ్విస్తున్న తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ఆయ‌న రోజా పై చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Also Read:కరోనా బారిన పడిన మెగాస్టార్

జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న రోజా, మ‌నో కూడా ఈ సారి రంగంలోకి దిగి కంటెస్టెంట్‌ ల‌తో క‌లిసి పంచ్ లు వేయ‌డం మొద‌లుపెట్టారు. ఇందులో భాగంగా మ‌నో ... రోజా పై చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. తాజాగా ఈ శుక్ర‌వారం ప్ర‌సారం కానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేశారు. ఈ ప్రోమోలో రోజాని ఉద్దేశించి మ‌నో చెప్పిన డైలాగ్ లు ఓ రేంజ్ లో పేలాయి. రాకింగ్ రాకేష్ స్కిట్ లో `ఆడ‌వాళ్ల‌కి స్వేచ్ఛ ఇస్తే ఏమౌతుందో మీకు తెలుసా? అని రాకేష్ అన‌డంతో `స్వేచ్ఛ ఇస్తే ఏం సాధించారో చెప్ప‌నా.. అదిగో ఎదురుగా చూడు` అంటూ రోజాని చూపించారు మ‌రో.

అ.ఆల ద‌గ్గ‌ర ఆపేసి ఉంటే .. అసెంబ్లీకి వెళ్లేదా? ఎబిసిడీల ద‌గ్గ‌ర ఆపేసి ఉంటే .. ఎమ్మెల్యే అయ్యేదా? ప‌గ‌ల‌న‌క రాత్ర‌న‌క ప్ర‌తిరోజు క‌ష్ట‌ప‌డింది కాబ‌ట్టే రోజా అయ్యిందిరా.. అంటూ మ‌నో రెచ్చిపోయి రోజాని వీర‌లెవెల్లో పొగిడేశాడు. అత‌ని భారీ డైలాగ్ ల‌కు `వ‌కీల్ సాబ్‌` బ్యాగ్రౌండ్ స్కోర్ తోడు కావ‌డంతో సీన్ చిరిగిపోయింది. ఇక మ‌నో మాట‌ల‌కు రోజా.. చేతులెత్తి దండం పెడుతూ అభివాదం చేసింది. మ‌నో హంగామా చేసిన `ఎక్స్ ట్రా జ‌బ‌ర్త‌స్త్‌` తాజా ఎపిసోడ్ ఈ శుక్ర‌వారం ప్ర‌సారంకానుంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...