English | Telugu

ఆది కోసం కొట్టుకున్న రోజా, ఆమ‌ని.. ఏంటిది?

జ‌బ‌ర్ద‌స్త్ షో బుల్లితెర హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ వేదిక‌పై క‌మెడియ‌న్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. స‌మ‌యం చిక్కితే స్టార్ పై కూడా అదిరిపోయే పంచ్ లు వేస్తూ అద‌ర‌గొట్టేస్తున్నారు. గ‌త కొన్నేళ్లుగా విజ‌య‌వంతంగా సాగుతున్న ఈ ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షో పండ‌గ స్పెష‌ల్ ప్రోగ్ర‌మ్స్ అంటూ కొత్త కొత్త కాన్సెప్ట్ ల‌తో స‌రికొత్త ఎపిసోడ్ ల‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సంక్రాంతి సంద‌ర్భంగా న‌టి అన్న‌పూర్ణ ప్ర‌ధానంగా `అమ్మ‌మ్మ‌గారి ఊరు` పేరుతో ప్ర‌త్యేక ఎపిసోడ్ ని చేశారు.

దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది. ఈ ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షో లో హైప‌ర్ ఆది చేసిన అల్ల‌రి అంతా ఇంతా కాదు. ఈ క‌మెడియ‌న్ కోసం ఒక‌నాటి పాపుల‌ర్ హీరోయిన్ లు ఇద్ద‌రు గొడ‌వ‌కు దిగ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఆ ఇద్ద‌రు హీరోయిన్ లు మ‌రెవ‌రో కాదు రోజా, ఆమ‌ని. ఈ షోలో `శుభ‌ల‌గ్నం` స్కిట్ ని హైప‌ర్ ఆది, ఆమ‌ని, రోజా చేశారు. హైప‌ర్ గా పంచ్ ల మీద పంచ్ లు వేసే ఆదిని.. నాకంటే నాకంటూ ఈ ఇద్ద‌రు హీరోయిన్ లు కొట్టుకునేంత ప‌ని చేశారు.

హైప‌ర్ ఆదిని ఆమ‌ని ద‌గ్గ‌రి నుంచి రోజా కొనేస్తుంది. అక్క‌డి నుంచి హైప‌ర్ ఆది.. రోజా పై ప్రేమ‌ని చూపించ‌డం మొద‌లుపెడ‌తాడు. దీంతో 'అదేంటీ నాద‌గ్గ‌ర వున్న‌ప్ప‌డు ఇంత ప్రేమ‌లేదే .. అయితే ఇత‌ను నాకే కావాలి' అంటుంది ఆమ‌ని, 'లేదు నాకే కావాల‌'ని రోజా అన‌డం మొద‌లుపెడుతుంది. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్దం న‌డుస్తుంది. ఈ సీనంతా గ‌మ‌నించిన హైప‌ర్ ఆదీ .. 'మీరెప్పుడైనా అనుకున్నారా? నా కోసం ఇలా మీరిద్ద‌రు కొట్టుకోవాల్సి వ‌స్తుంద‌ని' అన‌డంతో షోలో న‌వ్వులు విరిసాయి. ఈ షోలో `బంగార్రాజు` హీరోయిన్ కృతిశెట్టి, డైరెక్ట‌ర్ క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల గెస్ట్ లు గా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ జ‌న‌వ‌రి 15న సంక్రాంతి సంద‌ర్భంగా ఉద‌యం 9:00 గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...